'నిశ్శబ్ధంగా బాధపడకండి.. మమ్మల్ని సంప్రదించండి' అని.. రాచకొండ భద్రతా మండలి సైకో సోషల్ కౌన్సెలింగ్ సేవలను ఉపయోగించుకోవాలని ప్రజలను సీపీ మహేశ్ భగవత్ కోరారు. 04048214800 నంబర్‌కు ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు, సోమవారం నుంచి శనివారం వరకు ఎవరైనా కాల్ చేయవచ్చని స్పష్టం చేశారు. నేరెడ్మెట్ రాచకొండ సీపీ కార్యాలయంలో 'సైకో సోషల్ కౌన్సిలింగ్' కౌన్సిలర్లతో సీపీ, జాయింట్ సీపీ సుధీర్ బాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కరోనా మహమ్మారి కారణంగా 14 రోజుల పాటు ఒంటరితనం, ఒత్తిడి, నిరాశ, ఒంటరితనం, భయాలు, దుఃఖం, ఆందోళనతో బాధపడుతున్న అనేక సందర్భాలను చూసి.. అందరికీ మానసిక సామాజిక సలహా సేవలను ప్రారంభిస్తున్నామని సీపీ పేర్కొన్నారు.
ఈ సేవలు 2020లో లాక్డౌన్ సమయంలో అందుబాటులోకి వచ్చాయని.. మొదటి దశలో కౌన్సిలర్లు 200కి పైగా కాల్స్ మాట్లాడారని సీపీ అన్నారు. కరోనా రెండోదశ కారణంగా ఇప్పుడు మళ్లీ కౌన్సిలర్లు తమ సేవలను ప్రారంభించడానికి ముందుకు వచ్చారని తెలిపారు. కొవిడ్ భయం వల్లే ప్రజలు తమ విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని సీపీ అన్నారు.
ఇదీ చూడండి: సరిహద్దులో పోలీసుల ఆంక్షలు.. బాధితుల విజ్ఞప్తులు..!