ETV Bharat / state

శరవేగంగా అమరుల స్మారక చిహ్నం నిర్మాణం: మంత్రి ప్రశాంత్​ రెడ్డి - మంత్రి ప్రశాంత్​ రెడ్డి వార్తలు

తెలంగాణ అమరవీరుల స్మారకార్ధం హుస్సేన్​సాగర్ ఒడ్డున నిర్మిస్తున్న అమరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను రోడ్లు, భవనాలు,గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణమంతా కలియతిరిగి పలు సూచనలు చేశారు.

prashanth reddy
వేముల ప్రశాంత్ రెడ్డి
author img

By

Published : Jul 20, 2021, 10:09 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అమరుల ఆత్మగౌరవ సూచికగా హుస్సేన్​సాగర్ ఒడ్డున అమరుల స్మారక చిహ్నం నిర్మిస్తున్నారని రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అమరవీరుల స్మారకార్ధం హుస్సేన్​సాగర్ ఒడ్డున నిర్మిస్తున్న అమరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.

అమరుల త్యాగాన్ని స్మరించుకునే విధంగా అమరుల స్మారక చిహ్నం గొప్ప కట్టడంగా నిలువనుందన్నారు. రాష్ట్రానికి ఏ ముఖ్య అతిథిగా వచ్చిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని సందర్శించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేశారన్నారు. తెలంగాణ అమరుల త్యాగాన్ని చాటిచెప్పే విధంగా ఈ నిర్మాణం ఉంటుందని చెప్పారు. పనుల్లో వేగం పెంచాలని, నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులు పూర్తి కావాలని వర్క్ ఏజెన్సీని, అధికారులను ఆదేశించారు.

అనంతరం నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. బ్లాక్ వైస్ పనుల పురోగతి అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ ప్రాంగణమంతా కలియతిరిగారు. పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన గడువులోగా పూర్తి చేయాలని వర్క్ ఏజెన్సీని, ఆర్అండ్‌బీ శాఖ అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి: Huzurabad By Election: సర్వత్రా ఉత్కంఠ.. హుజూరాబాద్ తెరాస అభ్యర్థి ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.