ETV Bharat / state

బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకుండా కేంద్రం కుట్ర : పువ్వాడ అజయ్‌

Puvvada Ajay Kumar Fires on Central Government :కేంద్రంపై పువ్వాడ అజయ్‌ కుమార్‌ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. అక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా మౌలిక వసతుల్లో 50 శాతం ఖర్చు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

author img

By

Published : Apr 12, 2023, 1:43 PM IST

Updated : Apr 12, 2023, 5:21 PM IST

Puvvada Ajay Kumar
Puvvada Ajay Kumar
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకుండా కేంద్రం కుట్ర: పువ్వాడ అజయ్‌

Puvvada Ajay Kumar Fires on Central Government: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ వెనుక కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిల్లా గనులను అదానీపరం చేస్తోందని విమర్శించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు క్యాపిటివ్‌ గనులు లేకుండా చేసి మూసివేస్తున్నారని అన్నారు. బైలదిల్లా నుంచి ఐరన్‌ ఓర్‌ను ముంద్రాకు తరలించేందుకు కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.

ఆ గనులను బయ్యారానికి కేటాయించకుండా గుజరాత్‌కు తరలిస్తున్నారని పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. అదానీ కోసమే 1800 కిలోమీటర్ల దూరంలోని ముంద్రాకు తరలిస్తున్నట్లు తెలిపారు. బయ్యారంలో ఎప్పటికీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు జరగకుండా కుట్రలు చేస్తుందని ఆరోపించారు. బయ్యారంలో పరిశ్రమ పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. విశాఖ, బయ్యారం ఉక్కుపరిశ్రమలపై కేసీఆర్ మాట్లాడిన అంశాలపై కాంగ్రెస్, బీజేపీ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాయని మండిపడ్డారు.

కాంగ్రెస్, బీజేపీలు తెరచాటు ఒప్పందాలతో.. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా మాట్లాడటం లేదని పువ్వాడ అజయ్‌ కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్ విధానం ప్రైవేటీకరణకు వ్యతిరేకమని పునరుద్ఘాటించారు. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం బయ్యారం ఉక్కు పరిశ్రమ పెట్టినట్లయితే.. సుమారు 20,000 ఉద్యోగాలు వచ్చేవని అన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమకు గనులు కేటాయిస్తే.. సదుపాయాల కోసం పెట్టుబడిలో 50శాతం భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

నవోదయ, వైద్య కళాశాలల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పువ్వాడ అజయ్‌ కుమార్ విమర్శించారు. అదానీకి లాభం చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం.. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని ఎంపీలు మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమను సాధించుకునేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని ఎంపీలు పిలుపునిచ్చారు.

"విశాఖ స్టీల్‌ప్లాంట్ వెనుక కుట్ర జరుగుతోంది. కేంద్రప్రభుత్వం బైలదిల్లా గనులను అదానీపరం చేస్తోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు క్యాపిటివ్‌ గనులు లేకుండా చేసి మూసివేస్తారు. బైలదిల్లా నుంచి ఐరన్‌ఓర్‌ను ముంద్రాకు తరలించేందుకు కుట్ర. బయ్యారానికి కేటాయించకుండా గుజరాత్‌కు తరలిస్తున్నారు. అదానీ కోసమే 1800 కి.మీ. దూరంలోను ముంద్రాకు తరలిస్తున్నారు. బయ్యారంలో ఎప్పటికీ పరిశ్రమ ఏర్పాటు జరగకుండా కుట్ర చేస్తున్నారు." - పువ్వాడ అజయ్‌ కుమార్, మంత్రి

అదానీ కోసమే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ: విశాఖ ఉక్కు పరిశ్రమను అదానీ కోసమే ప్రైవేటీకరణ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. 2018 సెప్టెంబర్‌లో అదానీ గ్రూప్‌ బైలదిల్లా ఐరన్‌ఓర్‌ కంపెనీ పెట్టిందని తెలిపారు. ఈ క్రమంలోనే అక్కడి నుంచి నేరుగా గుజరాత్‌లోని ముంద్రాకు తరలించేలా ప్రణాళిక చేశారని పేర్కొన్నారు. తద్వారా బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయకుండా.. విశాఖ ఉక్కును లేకుండా చేయాలనే కుట్ర దాగి ఉందని ఆక్షేపించారు. కావాలనే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నష్టాల్లోకి నెట్టారని కేటీఆర్‌ పేర్కొన్నారు.

నష్టాలు చూపించి చౌకగా తన స్నేహితులకు విక్రయించటం ప్రధాని మోదీ విధానమని ఆరోపించారు. ప్రధాని.. అదానీ ఇద్దరూ కలిసి తెలుగు రాష్ట్రాల సంపదను కొల్లగొడుతున్నారని విమర్శించారు. తాను వీటిపై నిర్దిష్ఠమైన ఆధారాలతో చేస్తున్న ఈ ఆరోపణ తప్పని నిరూపిస్తే.. పరువునష్టం దావా ఎదుర్కొనేందుకైనా సిద్ధమని కేటీఆర్‌ సవాల్ విసిరారు.

ఇవీ చదవండి: విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో సింగరేణి బృందం.. కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించిన ఉక్కు పోరాట కమిటీ

మూగజీవాలపై ప్రేమ.. 40 పిల్లులను పెంచుతున్న 'అమిత్ షా'.. నెలకు రూ.40 వేలు ఖర్చు!

Last Updated : Apr 12, 2023, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.