అడవితల్లిని నమ్ముకుని బతికే గిరిజనులు భూముల హక్కుల కోసం ఏళ్ల తరబడి ఎడతెగని పోరాటం(Podu farmers fight) చేస్తున్నారు. తాతల తరాల నుంచి సాగు చేసుకునే భూములను సర్కార్ లాక్కోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి పెద్ద యుద్ధమే(Podu farmers fight) జరుగుతోంది. అడవితల్లిపై హక్కు తమదే అని గిరిజనులు.. ఆ భూముల్లో సాగు చేయొద్దని అధికారులు ఒకరిపై మరొకరు దాడికి(Podu farmers fight) దిగుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ, అటవీశాఖల మధ్య సరిహద్దు వివాదం తేలకపోవడం మరికొన్ని వివాదాలకు కారణమవుతోంది.
అటవీ భూముల సమస్య ఇలా ఉండగా.. పోడు భూముల అంశంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL in Highcourt) దాఖలైంది. విశ్రాంత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, చెరకు సుధాకర్, కబ్బాక శ్రావణ్ కుమార్ సంయుక్తంగా దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఆరు వారాల్లో..
పోడు భూములపై ఆధారపడిన ఆదివాసీలు, ఇతర పేదలను ఖాళీ చేయించే ప్రయత్నం జరుగుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. ఆదివాసీల సాగు భూములను ఖాళీ చేయించడం రాజ్యాంగానికి, సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని వాదించారు. పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న హైకోర్టు.. ఆదివాసీలు, ఇతర పేదలు సాగుచేసుకుంటున్న పోడు భూములపై వివరాలు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఆరు వారాల్లో స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది.
భూమి కోసం అడవుల నరికివేత..?
అడవుల రక్షణ(Forest conservation in Telangana)లో అటవీశాఖ అధికారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పోడు వ్యవసాయం(Podu cultivation) ఒకటి. మానవ నాగరికతలో పోడు వ్యవసాయం(Podu cultivation) కొత్త విషయమేమీ కాదు. అపరిమితంగా పెరిగిన జనాభాలో ఎక్కువ శాతం జీవనాధారం కోసం వ్యవసాయంపై ఆధారపడ్డారు. వారు భూమి కోసం అడవులను నరికివేయడంవల్ల పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతోంది. అటవీశాఖ అధికారులు అడవుల నరికివేతను ఆపడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నా, పలు కారణాలవల్ల పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోతున్నారు. ఇప్పటివరకు లక్షల ఎకరాల అటవీ భూములను స్థానికులు ఆక్రమించి సాగు చేపట్టారు.
గొర్రెల పంపిణీ అవినీతిపై..
గొర్రెల పంపిణీపై సీబీఐ విచారణకు ఆదేశించేందుకు హైకోర్టు నిరాకరించింది. సుమారు 5 వేల కోట్ల రూపాయలతో గొర్రెలు, దాణా పంపిణీలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ వాచ్ వాయిస్ ఆఫ్ ది పీపుల్ సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ ముగిసింది. విచారణకు ఆదేశించదగిన కారణాలు కనిపించడం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం పేర్కొంది. అవినీతి, అక్రమాలు, దుర్వినియోగంపై విచారణ జరిపేందుకు లోకాయుక్తకు పూర్తి అధికారాలు ఉన్నాయని హైకోర్టు తెలిపింది. లోకాయుక్తకు ఫిర్యాదు చేసి ఆధారాలను సమర్పించవచ్చునని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది.
ఇదీ చూడండి: పోడుభూముల సమస్య పరిష్కార విధానంపై సీఎస్ సమీక్ష
Forest conservation in Telangana : పోడు సాగుతో అడవులకు తిప్పలు