ETV Bharat / state

'రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది' - public health directer srinivas spoke on corona in telangana

కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్ శ్రీనివాస్‌ అన్నారు. రాష్ట్రంలో ప్రతి 10లక్షల మందిలో 79వేలకు పైగా పరీక్షలు చేస్తున్నామని చెప్పారు.సెప్టెంబర్‌లో కరోనా పాజిటివ్‌ రేటు కేవలం 4 శాతం ఉందని ఆయన వెల్లడించారు.

public health directer srinivas spoke on corona in telangana
'రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది'
author img

By

Published : Sep 29, 2020, 5:00 PM IST

Updated : Sep 29, 2020, 9:02 PM IST

'రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది'

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్​ శ్రీనివాస్​ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15.42 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయని ప్రకటించారు. ప్రతి పది లక్షల మందికి 79 వేలకు పైగా పరీక్షలు చేస్తున్నామని... కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వం ప్రణాళికబద్దంగా వెళ్తోందని ఆయన తెలిపారు. జూన్‌ నెలలో కరోనా పాజిటివ్ రేటు అత్యధికంగా 23 శాతం నమోదైందని ప్రకటించారు. సెప్టెంబర్‌లో కరోనా పాజిటివ్‌ రేటు కేవలం 4 శాతం ఉందని ఆయన వెల్లడించారు.

రోజుకు సగటున 55 వేల మందికి కరోనా పరీక్షలు చేస్తున్నామని.. రికవరీ రేటు జాతీయస్థాయి కంటే రాష్ట్రంలోనే అధికంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.59 శాతం మాత్రమే ఉందని... ప్రభుత్వ ఆస్పత్రుల్లో 25 శాతం పడకలు మాత్రమే నిండాయని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో 230 ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 50 శాతం మంది పొరుగు రాష్ట్రాల వారు చికిత్స పొందుతున్నారని డైరెక్టర్​ ఆఫ్​ పబ్లిక్​ హెల్త్​ శ్రీనివాస్​ తెలిపారు.

ఇవీ చూడండి: తెలంగాణలో మరో 2,072 కరోనా కేసులు, 9 మరణాలు

Last Updated : Sep 29, 2020, 9:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.