ETV Bharat / state

పెట్రో ధరలకు నిరసనగా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు: ఉత్తమ్​ - పెట్రో ధరలకు నిరసనగా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు: ఉత్తమ్​

గత కొన్ని రోజులుగా పెరుగుతున్న పెట్రోల్​, డీజిల్​ ధరలకు నిరసనగా సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్​ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడుతామని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్​కుమార్​రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్​లకు వినతి పత్రాలను అందజేస్తామని తెలిపారు.

Protests in front of Collectorates in protest of petrol prices
పెట్రో ధరలకు నిరసనగా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు: ఉత్తమ్​
author img

By

Published : Jun 28, 2020, 2:32 PM IST

పెట్రోల్​ ధరల పెరుగుదలకు నిరసనగా సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన తెలుపుతామని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్​కుమార్​రెడ్డి వెల్లడించారు. ఈనెల 30న అన్ని జిల్లా కేంద్రాల్లో కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనలు వ్యక్తం చేస్తామని తెలిపారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ సీనియర్ నేతలతో కలిసి ఉత్తమ్‌ మాట్లాడారు.

లాక్​డౌన్ సమయంలో పేద కుటుంబాలకు విద్యుత్‌ బిల్లులు మాఫీ చేయాలని ఉత్తమ్‌ డిమాండ్ చేశారు. కరోనాతో చనిపోయిన పాత్రికేయుల కుటుంబాలకు రూ.50 లక్షలు చెల్లించాలన్నారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీచూడండి: 'కుల, ధన బలం లేకుండానే సీఎం, ప్రధాని అయ్యారు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.