పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌లో.. కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పార్టీ నాయకురాలు ఇందిరా రావు ఆధ్వర్యంలో.. బంకుల వద్ద ప్లకార్డులతో మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
భాజపా ప్రభుత్వం.. ఏడేళ్లుగా ఇంధన, నిత్యావసరాల ధరలను విపరీతంగా పెంచుతూ ప్రజలపై భారం మోపుతోందని ఇందిరా రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా 45 సార్లు ఇంధన ధరలను పెంచిందంటూ మండిపడ్డారు. ధరలను వెంటనే తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: షర్మిలకు చుక్కెదురు.. కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు..!