నూతన వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లులను రద్దు చేయాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. రైతుకు కనీస మద్దతు ధర పొందేందుకు చట్టం చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద అఖిల భారత రైతు పోరాట కమిటీ ఆధ్వర్యంలో రైతు సంఘాలతోపాటు ఇతర సంఘాలు ధర్నా చేపట్టాయి.
ప్రధాని మోదీ నిర్లక్ష్యం వల్లే దేశంలో రైతులు చనిపోయారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంతోపాటు వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు.
కార్పొరేట్ సంస్థల కోసం వ్యవసాయాన్ని కేంద్ర ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
ఈ ధర్నాలో తెలంగాణ విద్యావంతుల వేదిక, దళిత బహుజన ఫ్రంట్, మానవహక్కుల వేదిక, తెలంగాణ డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్, తెలంగాణ ఉమెన్ అండ్ ట్రాన్స్‌జెండర్ జేఏసీ తదితర యూనియన్‌లు పాల్గొన్నాయి.
ఇదీ చూడండి: స్విఫ్ట్ కారు, ద్విచక్రవాహనం ఢీ... ఒకరు మృతి