ETV Bharat / state

'సొంత పొలాల్లోనే కూలీలుగా మారే స్థితికి భాజపా తీసుకొచ్చింది' - central government agricultural bill

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును హైదరాబాద్​ గాంధీభవన్​లో కాంగ్రెస్​ వర్కింగ్ ప్రెసిడింగ్ పొన్నం ప్రభాకర్​ తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని కార్పొరేట్​ సంస్థలకు ధారాదత్తం చేస్తోందన్నారు. సొంత పొలంలోనే రైతులు కూలీలుగా మారే స్థితి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

protest against agricultural bill  by congress leader ponnam prabhakar
'సొంత పొలాల్లోనే కూలీలుగా మారే స్థితికి భాజపా తీసుకొచ్చింది'
author img

By

Published : Oct 1, 2020, 2:32 PM IST

దేశంలోని అన్ని వ్యవస్థలను ఇప్పటికే కార్పొరేట్​ సంస్థలకు కట్టబెడుతున్న భాజపా ప్రభుత్వం ఆఖరికి వ్యవసాయాన్ని ధారాదత్తం చేస్తోందని రాష్ట్ర కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడింట్​ పొన్నం ప్రభాకర్​ రెడ్డి హైదరాబాద్​ గాంధీభవన్​లో ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలతో రైతుకు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నదాతలు సొంత పొలంలోనే కూలీలుగా మారే పరిస్థితి వస్తుందన్నారు. పార్లమెంట్​లో బిల్లులు ప్రవేశపెట్టిన దగ్గర నుంచి కాంగ్రెస్​ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు.

శుక్రవారం గాంధీ, లాల్​బహదూర్​ శాస్త్రి జన్మదినాలను పురస్కరించుకుని కాంగ్రెస్​ సంతకాల సేకరణ చేస్తుందని పొన్నం తెలిపారు. నవంబర్​ 14న రైతుల సంతకాలను రాష్ట్రపతికి అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్​ పార్లమెంట్​లో మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. సున్నా వడ్డీని తుంగలో తొక్కి.. ముఖ్యమంత్రి కేసీఆర్​ రైతుల నడ్డీ విరగొట్టారని పొన్నం విమర్శించారు.

ఇదీ చదవండిః వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతుల సంతకాల సేకరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.