నల్లమలలో యురేనియం తవ్వకాలపై కాంగ్రెస్ గళం విప్పింది. ఈ నెల 16న యురేనియం వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ వి.హనుమంతరావు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఈ సమావేశంలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్రెడ్డి(కాంగ్రెస్), జనసేన అధినేత పవన్ కల్యాణ్, తమ్మినేని వీరభద్రం(సీపీఎం), చాడా వెంకటరెడ్డి(సీపీఐ), ఎల్.రమణ (తెదేపా), మాజీ ఎమ్మెల్సీ ప్రొ.కె.నాగేశ్వర్, ప్రొ.కోదండరాం(తెజస), చెరుకు సుధాకర్(ఇంటి పార్టీ), పర్యావరణ శాస్త్ర వేత్తలు ప్రో.పురుషోత్తం, ప్రో.ఆనందరావు, లక్ష్మన్న తదితరులు సమావేశానికి హాజరవుతారు. అఖిలపక్షం తరువాత ప్రజల్లోకి వెళ్తామని వీహెచ్ అన్నారు. యురేనియం తవ్వకాలతో కృష్ణ పరివాహక ప్రాంతం అంతా విషతుల్యం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. న్యూ క్లియర్ పవర్ అవసరమైతే యురేనియం దిగుమతి చేసుకోవచ్చని.. పర్యావరణానికి హాని కల్గించవద్దని ప్రభుత్వానికి హనుమంతరావు సూచించారు.
ఇదీ చూడండి :డియర్ కామ్రేడ్స్... నల్లమలను కాపాడుకుందాం