ETV Bharat / state

జీహెచ్​ఎంసీలో ప్రతి ఆదివారం ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కార కార్యక్రమం

author img

By

Published : Jan 23, 2021, 5:17 AM IST

జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని స‌ర్కిల్ కార్యాల‌యాల్లో ప్రాప‌ర్టీ ట్యాక్స్ ప‌రిష్కారం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్​కుమార్ వివరాలు వెల్లడించారు.

జీహెచ్​ఎంసీలో ప్రతి ఆదివారం ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కార కార్యక్రమం
జీహెచ్​ఎంసీలో ప్రతి ఆదివారం ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కార కార్యక్రమం

బల్దియా పరిధిలోని అన్ని స‌ర్కిల్ కార్యాల‌యాల్లో ప్రాప‌ర్టీ ట్యాక్స్ ప‌రిష్కార కార్యక్రమం నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్​కుమార్ తెలిపారు. ఆస్తి ప‌న్ను సంబంధిత ఫిర్యాదులు, ఆస్తిప‌న్ను మదింపు, కోర్టు కేసుల ప‌రిష్కారం త‌దిత‌ర అంశాల‌పై కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం ఉద‌యం 9. 30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం వంటి గంట వ‌ర‌కు నిర్వహించే ఈ కార్యక్రమంలో జోన‌ల్ క‌మిష‌న‌ర్లు, డిప్యూటీ క‌మిష‌న‌ర్లు ఇత‌ర అధికారులు పాల్గొని వివాదాల‌ను ప‌రిష్కరిస్తార‌ని స్పష్టం చేశారు.

ఈనెల 24 నుంచి మార్చి 28 వరకు...

ఆస్తిప‌న్ను సంబంధిత స‌మ‌స్యలు ఏవైనా ఉంటే ఈ ప్రాప‌ర్టీ ట్యాక్స్ ప‌రిష్కార కార్యక్రమానికి హాజ‌రుకావాలని క‌మిష‌న‌ర్ సూచించారు. ఈనెల 24 నుంచి మార్చి 28 వరకు ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి స‌ర్కిల్ కార్యాల‌యంలో ప్రత్యేక కౌంట‌ర్లు ఏర్పాటుచేసి ఆస్తిప‌న్ను వివాదాల‌కు సంబంధించి ఫిర్యాదుల‌ను స్వీక‌రిస్తామ‌న్నారు.

లొసుగుల సరి...

ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో బల్దియాలో సేక‌రించాల్సిన ఆస్తిప‌న్ను ల‌క్ష్యం రూ. 1,900 కోట్లు. ఇప్పటి వరకు రూ. 1247.27 కోట్లు ఆస్తిపన్ను కింద వసూలైనట్లు వెల్లడించారు. ఆస్తిప‌న్నును ఏమాత్రం పెంచ‌కుండా అంత‌ర్గత లొసుగుల‌ను స‌రిచేసుకుంటూ ఇప్పటికే మ‌దింపు కానీ ఆస్తుల‌ను ఆస్తిప‌న్ను చెల్లింపు పరిధిలోకి తేవ‌డం... ఆస్తిప‌న్ను వివాదాల‌ను తొల‌గించేందుకు ప్రాప‌ర్టీ ట్యాక్స్ ప‌రిష్కారం త‌దిత‌ర చ‌ర్యల ద్వారా మొత్తాన్ని సేక‌రించుకోవాల‌ని నిర్ణయించారు.

ఇదీ చదవండి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన నీతిఆయోగ్ బృందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.