ETV Bharat / state

'10శాతం శ్రద్ధ పెట్టినా సమస్యలు పరిష్కారమయ్యేవి'

author img

By

Published : May 25, 2021, 2:12 PM IST

ఈటల వ్యవహారంలో ప్రభుత్వం పెట్టిన శ్రద్ధలో 10శాతం కరోనా కట్టడి, ప్రజల ఇబ్బందులపై పెడితే సమస్యలు పరిష్కారం అవుతాయని కోదండరాం విమర్శించారు. పరీక్షలు తగ్గించి కేసులు తగ్గాయనడం సరైంది కాదని సూచించారు.

professor kodandaram criticize over corona cases in the state
'10శాతం శ్రద్ధ పెట్టినా సమస్యలు పరిష్కారమయ్యేవి'

కోవిడ్‌ తగ్గుముఖం పట్టినట్టే అని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ గ్రామాల్లో మాత్రం తీవ్రత తగ్గలేదని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం తెలిపారు. కొవిడ్‌ పరీక్షలను ప్రభుత్వం తగ్గించి కేసులు తగ్గాయని చెప్పుకోవడం సరైందికాదన్నారు. పరీక్షల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తే పరీక్షలు తగ్గించాలని ఆదేశాలు వచ్చినట్లు చెబుతన్నారని ఆరోపించారు. ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్తే విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు.

ప్రభుత్వం వెంటనే పరీక్షలు పెంచాలని, గ్రామాల్లో ఐసోలేషన్‌ సెంటర్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రులు జీవో ప్రకారం ఫీజులు వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈటల రాజేందర్‌ అనుచరులను తమ వైపుకు తిప్పుకునేందుకు పెట్టిన శ్రద్ధలో పది శాతం పెట్టిన ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించారు.

ఇదీ చదవండి : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.