ETV Bharat / state

Contract Employees: హైకోర్టు తీర్పుతో మళ్లీ చిగురిస్తున్న ఒప్పంద ఉద్యోగుల ఆశలు... - తెలంగాణ వార్తలు

ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ ప్రక్రియ త్వరలోనే మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. న్యాయపరమైన చిక్కులు వీడడంతో క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించిన అంశంపై అధికారులు దృష్టి సారించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ నుంచి ఆదేశాలు అందాక కార్యాచరణ ప్రారంభించనున్నారు.

Contract Employees
Contract Employees
author img

By

Published : Dec 11, 2021, 5:19 AM IST

రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పుతో ఒప్పంద ఉద్యోగుల్లో ఆశలు మళ్లీ చిగురించాయి. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. దీంతో వారి క్రమబద్ధీకరణ ప్రక్రియకు న్యాయపరమైన ఆటంకాలు తొలగిపోయినట్లైంది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్​ నేతృత్వంలో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించింది. 2015లో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఆర్థిక, వైద్య-ఆరోగ్య, విద్యా శాఖల కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేసింది. అన్ని అంశాలను పరిశీలించి ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం 2016 లో ఉత్తర్వును జారీ చేసింది. ఆ జీఓ ప్రకారం కొందరి క్రమబద్ధీకరణ ప్రక్రియ కూడా పూర్తయింది.

జీఓ 16 అమలుపై హైకోర్టు స్టే...

అయితే ఇది నిరుద్యోగ యువత అవకాశాలకు నష్టం చేకూరుస్తుందని 2016 లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీంతో జీఓ 16 అమలుపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఇటీవలే ఆ పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై మళ్లీ చర్చ ప్రారంభమైంది. భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలోనే 50 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇప్పటికే ప్రకటించారు. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, కేటాయింపుల ప్రక్రియ పూర్తయ్యాక నియామకాలు చేపట్టేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. అయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ ప్రకారం నియామకమైన ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అంటున్నారు.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో...

డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో ఒప్పంద ఆధ్యాపకులతో పాటు వైద్య-ఆరోగ్య, పురపాలక, పంచాయతీ రాజ్ శాఖల్లో ఈ తరహా ఉద్యోగులు ఉన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో క్రమబద్ధీకరణ ప్రక్రియపై మళ్లీ కదలిక వచ్చే అవకాశం కనిపిస్తోంది. అధికారులు ఇందుకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించారు. గతంలో చేసిన కసరత్తు, జారీ చేసిన ఉత్తర్వు, క్రమబద్ధీకరణ కోసం సిద్ధం చేసిన జాబితా, హైకోర్టు తీర్పు ప్రతి, తదితరాలను పరిశీలిస్తున్నారు. అన్ని అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఆయా శాఖల్లో ఉన్న ఒప్పంద ఉద్యోగులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కూడా సేకరించనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా తదుపరి కార్యాచరణ చేపట్టనున్నారు.

ఇదీ చదవండి: Singareni Workers Samme: 'ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను కార్పొరేట్లకి కట్టబెట్టడమేంది..?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.