ETV Bharat / state

'చనిపోయిన వాళ్లకి పదిలక్షలు ఇస్తారు కానీ... బతికున్న వాళ్లకి సాయం చేయరా?'

author img

By

Published : Oct 28, 2021, 7:41 AM IST

ఆడబిడ్డలపై జరుగుతున్న దాడులకు సజీవ సాక్ష్యం ఆ యువతి. ఏడాది క్రితం ఓ మృగాడి దాడిలో గాయపడి.. గొంతు మూగబోయిన పరిస్థితి. లక్షలు పోస్తేనే కానీ తిరిగి మామూలు మనిషి కాదన్నప్పుడు.. రక్షించుకొనేందుకు తల్లిదండ్రులు పెద్ద పోరాటమే చేశారు. ఇప్పుడు మాట్లాడుతున్నా.. ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. నెల నెలా ముంబయి వెళ్లి చికిత్స చేయించుకుంటేనే పరిస్థితి మెరుగవుతుంది. కానీ చేతిలో డబ్బులు లేవు. సాయం చేస్తామన్న ప్రభుత్వం నుంచి స్పందన కరవైంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ యువతి.. చేయని తప్పుకు తనకేంటీ శిక్ష అంటూ విలపిస్తోంది.

priyanka-was-injured-by-a-young-man-in-visakhapatnam-last-year
గొంతు కోల్పోయిన యువతి

గొంతు కోల్పోయిన యువతి

ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో.. ఏపీ విశాఖలోని థాంప్సన్ వీధిలో ఉండే సాయి ఈశ్వర్ ప్రియాంకపై ఆమె ఇంటి పక్కనే ఉండే శ్రీకాంత్ అనే యువకుడు 2020 డిసెంబరు రెండో తేదీన దాడి చేశాడు. హెక్సాబ్లేడుతో ప్రియాంక గొంతుపై నాలుగు చోట్ల బలంగా కోసేయడంతో నెల రోజులపాటు మృత్యువుతో పోరాడింది. అయితే.. ప్రాణాలు దక్కినప్పటికీ గొంతు మాత్రం మూగబోయింది. ముంబయిలోని ప్రిన్స్ అలీఖాన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేస్తే.. మళ్లీ మాటలు వస్తాయని తెలిసి ప్రియాంక తల్లిదండ్రులు ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ సాయంతో అక్కడికి తీసుకెళ్లారు.

బిల్లు పెట్టుకోమన్నారు కానీ...

శస్త్రచికిత్స, ఇతర ఖర్చులకు 11 లక్షల అవుతుందని తెలిసి సాయం కోసం అధికారుల్ని వేడుకున్నారు. శస్త్రచికిత్స తర్వాత బిల్లు పెట్టుకోవాలని వారు సూచించారు. ఎమ్మెల్యే వాసుపల్లి లక్ష సాయం చేయగా.. మిగిలిన మొత్తం కోసం సామాజిక మాధ్యమాల్లో తమ పరిస్థితిని వివరిస్తూ పోస్ట్‌ పెట్టారు. క్రికెటర్ హనుమ విహారి స్పందించి 5 లక్షలు అందించారు. మిగిలిన మొత్తాన్ని సమకూర్చుకుని ఈ ఏడాది జూన్ 21వ తేదీన శస్త్రచికిత్స చేయించారు. ప్రియాంక ప్రస్తుతం ఒకింత మాట్లాడగలుగుతోంది. కానీ.. తలను మాత్రం ఎప్పుడూ వంచే ఉంచాల్సిన దుస్థితి.

కాగా.. ప్రియాంకను ప్రతినెలా ముంబై ఆసుపత్రికి తీసుకెళ్లాలి. దారి ఖర్చులు, మందులు, ఇతర ఖర్చులకు నెలకు 65వేలు చొప్పున ఖర్చవుతున్నాయి. ఇప్పటికి రెండుసార్లు వెళ్లారు. ఆర్థిక సమస్యల కారణంగా మూడోసారి వెళ్లలేకపోయారు. శస్త్రచికిత్సకు అయిన ఖర్చులు ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందేమోనని ఆమె తల్లిదండ్రులు దీనంగా ఎదురుచూస్తున్నారు. మృగాళ్ల దాడుల్లో మరణిస్తున్న వారికి డబ్బులిచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వం బతికున్న వారికి అవసరమైన వైద్యం చేయించడానికి సాయం చేయకపోతే ఎలాగని ప్రియాంక తల్లి ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించాలి..

ప్రభుత్వం నుంచి డబ్బులు ఇప్పించడానికి కొందరు ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారని.. అవసరమైతే వ్యక్తిగత సాయం చేస్తామని చెప్పారంటున్న ప్రియాంక తల్లి.. ప్రభుత్వం మాత్రం ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదంటున్నారు. తన కూతురు ఆరోగ్యం దిగజారక ముందే ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: attack with knife: ప్రేమించలేదని ఉన్మాదం.. యువతిపై కత్తితో దాడికి యత్నం

ప్రేమించలేదని నరికేశాడు..

Love Maniac : ప్రేమించలేదని నర్సు గొంతుకోసిన ఉన్మాది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.