ETV Bharat / state

అమ్మో అద్దె వాహనం.. ఇంటికెళ్లేందుకు అ'ధనం' - లాక్​డౌన్​

ఉన్నత చదువులు.. ఉద్యోగాలు.. వైద్యసేవలు.. బంధువులు.. ఇలా ఏ కారణం మీద హైదరాబాద్‌ వచ్చినా.. తిరిగెళ్లడమే ఇప్పుడు పెద్ద సవాలు. నగరానికి వివిధ పనుల మీద మార్చి 21కి ముందు వచ్చిన వారంతా ఒక్కరోజు జనతా కర్ఫ్యూ అనుకుని ఆగిపోయారు. ఆ తర్వాత అనూహ్యంగా పెరుగుతూ వస్తున్న లాక్‌డౌన్‌తో ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. వీరికి ఉపశమనం కల్పిస్తూ సొంతూళ్లకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. సొంతవాహనాలు లేనివారి పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. వారి అవసరాన్ని అవకాశంగా వాడుకుంటూ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు ప్రైవేటు వాహనదారులు. కొందరు అడిగిన మొత్తం చెల్లించి వెళ్తుంటే.. అంత ఖర్చుచేయలేక మరికొందరు ఇక్కడే ఆగిపోతున్నారు.

corona effect on private travel vehicle charges

author img

By

Published : May 10, 2020, 8:14 AM IST

భాగ్యనగరంలో చిక్కుకుపోయిన వారు స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రజారవాణా లేకపోవడం వల్ల ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. గతంలో హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు వెళ్లేందుకు ఈ వాహనాలు కిలోమీటరుకు రూ.10, రూ.11 చొప్పున వసూలు చేసేవారు. ఇప్పుడు కొందరు వాహనదారులు రూ.16 నుంచి రూ.18కి పెంచేశారు. దీనికితోడు వెళ్లే మార్గంలో ఉన్న టోల్‌ రుసుములన్నీ ప్రయాణికులే భరించాలి. వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు అనుమతులు కూడా ప్రయాణికుల బాధ్యతనే. ఇది అత్యవసరంగా వెళ్లాల్సిన వారికి ఇబ్బందిగా మారుతోంది.

ఇక్కడ ఓ అపార్ట్‌మెంట్‌లో పనిచేసేందుకు నా భార్యతో వచ్చాను. తనిప్పుడు గర్భవతి. డెలివరీ సమయానికి సొంతూరికి వెళ్లిపోవాలనుకున్నాం. నెలలు నిండాయి. ఇక వెళ్లిపోదామనుకునేసరికి ఈ లాక్‌డౌన్‌ వచ్చింది. ఇక్కడ తెలిసిన వారెవరూ లేరు. తుని ప్రభుత్వాసుపత్రిలో డెలివరీ చేపించాలనుకున్నాం. వెళ్దామని ప్రయత్నాలు చేస్తే ప్రైవేటు వాహనాలు రూ.30వేలు, రూ.40వేలు అడుగుతున్నారు.

- అప్పారావు, తుని, తూర్పుగోదావరి జిల్లా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.