ETV Bharat / state

ప్రైవేటు బండి వస్తోంది... రెగ్యులర్ బండి పక్కకు​ జరపండి! - లింగంపల్లి-తిరుపతి తొలి ప్రైవేట్​ రైలు మార్గం

​ రైల్వే జోన్‌లో ప్రైవేటు రైళ్లు వచ్చేటప్పుడు రోజువారీ ట్రైన్‌లను పక్కకు నిలిపివేస్తున్నారు. తొలి రైలుకే ఇలా అయితే భవిష్యత్తులో ప్రైవేటు రైళ్ల సంఖ్యను పెంచేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. ఈ తరుణంలో రెగ్యులర్​ ట్రైన్​ల పరిస్థితేంటని నిపుణులు అంటున్నారు. జోన్​లో తొలి ప్రైవేట్​ రైలు లింగంపల్లి-తిరుపతి మార్గంలో పరుగులు తీసింది.

private trains run at south central railways
ప్రైవేటు బండి వస్తోంది... రెగ్యులర్ బండి పక్కకు​ పక్కకు
author img

By

Published : Feb 16, 2020, 1:20 PM IST

రైలు బండి అంటేనే ఆలస్యానికి చిరునామాని సగటు ప్రయాణికుడి అభిప్రాయమిది. మరోవైపు ప్రైవేటు రైళ్లేమో సమయానికి గమ్యస్థానం చేరతాయని ప్రకటనలు. ఇందుకు అనుగుణంగా అవి సకాలంలో గమ్యస్థానం చేరేలా ముందు నడిచే రెగ్యులర్‌ ట్రైన్‌లను పక్కకు ఆపుతున్నారు రైల్వే అధికారులు.

రానున్న రోజుల్లో ప్రైవేటు రైళ్ల సంఖ్య 100 మార్గాల్లో 150కి పెంచేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతున్నందున.. ఇప్పటికే ఆలస్యంగా నడుస్తున్న రెగ్యులర్‌ రైళ్లు మరింత జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

పరిహారం తప్పించుకునేందుకు

ఐదు నెలల క్రితం దిల్లీ-లఖ్‌నవూ తర్వాత ముంబయి-అహ్మదాబాద్‌ల మధ్య ప్రైవేటు తేజస్‌ రైళ్లు పట్టాలెక్కాయి. మరో ప్రైవేటు రైలు ఇండోర్‌-వారణాసి మధ్య రాకపోకలకు సిద్ధమైంది. మెరుగైన సేవల పేరుతో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు రైళ్లలో ఎక్కేలా ప్రయాణికుల్ని ఆకర్షించేందుకు ఆఫర్లు ప్రకటిస్తున్నారు.

ఏదైనా కారణంతో రైలు గమ్యస్థానానికి ఆలస్యంగా చేరుకుంటే సమయాన్ని బట్టి ఒక్కో ప్రయాణికుడికి రూ.100 నుంచి రూ.250 వరకు పరిహారం ఇస్తారు. ఈ విషయాన్ని సాక్షాత్తు రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్వీట్‌ చేశారు.

రైలు ఆలస్యంగా చేరుకున్నప్పుడు లీజుకు తీసుకున్న ప్రైవేటు ఆపరేటర్‌ కాకుండా ఐఆర్‌సీటీసీ పరిహారం ఇవ్వాల్సి వస్తోంది. ఐఆర్‌సీటీసీపై ఈ భారాన్ని తప్పించేందుకు రైల్వేశాఖ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ప్రైవేటు రైళ్లు తిరుగుతున్న మార్గాల్లో.. వీటికి ప్రాధాన్యమిస్తూ అవి వెళ్లేవరకు రెగ్యులర్‌ రైళ్లను ఆపుతున్నట్లు తెలిసింది. ఈ విషయం నిజమేనని.. ఓ లోకోపైలెట్‌ తెలిపారు.

కీలక మార్గాలు ప్రైవేటుకు

సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ల నుంచి తిరుపతికి వెళ్లే 8 రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతుంటాయి. ఈ మార్గం లాభదాయకమైంది. రైల్వేబోర్డు ఈ జోన్​పై దృష్టిసారించినట్లు తెలుస్తుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధి నుంచి ప్రవేశపెట్టే 11 ప్రైవేటు రైళ్లలో లింగంపల్లి-తిరుపతి(డైలీ) బండికి తొలుత టెండర్లు పిలవాలని భావిస్తున్నట్లు తెలిసింది.

శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ల కంటే అధిక ఛార్జీలుండే ఈ ప్రైవేటు రైళ్లలో డిమాండ్‌ను బట్టి విమానటికెట్ల తరహాలో పెంచుకునే వెసులుబాటును ఆపరేటర్లకు రైల్వేశాఖ కల్పిస్తోంది. ఈ నిర్ణయాలతో ప్రయాణం మరింత ఖరీదు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: ఆలోచింపజేసిన అపోలో క్యాన్సర్​ కాంక్లేవ్..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.