మార్చి రెండోవారంలోనే దాదాపు విద్యార్థులు, ఉద్యోగులు అంతా సొంతూళ్లకు చేరుకోగా.. వెళ్లలేక కొందరు మిగిలిపోయారు. దీంతో హాస్టళ్లు తప్పనిసరి నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా ఉన్న నలుగురి నుంచి వచ్చే అద్దెతో పనిచేసేవాళ్లకు జీతాలు చెల్లించలేక.. భవనాలకు అద్దె కట్టలేక.. కరెంటు బిల్లులు చెల్లించలేక అప్పులు తీసుకొస్తున్నామని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనసాగుతున్న నష్టాల్ని భరించలేక మూసేసేందుకు సిద్ధమవుతున్నారు. ఊళ్లకు వెళ్లిన వారి సామగ్రి ఇక్కడే ఉండటం, వారు అద్దె చెల్లించకపోవడం వల్ల ఇబ్బంది తప్పట్లేదని వసతిగృహాల నిర్వాహకులు వాపోతున్నారు.
మూడేళ్లుగా గర్ల్స్, బాయ్స్‌కి ప్రత్యేక వసతిగృహాలు నిర్వహిస్తున్నాను. ఉన్నట్టుండి అందరూ వెళ్లిపోవడం వల్ల అందులో ఐదుగురు, ఇందులో నలుగురు మిగిలారు. వారికోసం సిబ్బంది కూడా పనిచేయాల్సి వస్తోంది. జీతాలు చెల్లించడం కష్టంగా ఉంది.
-నరేందర్, పంజాగుట్టలో హాస్టల్ నిర్వాహకుడు
మా హాస్టళ్లో పదిమందే మిగిలారు. వీరితో నడిపితే వచ్చే డబ్బులతో అద్దెలు చెల్లించలేకపోతున్నాను. కరెంట్ బిల్లు అధికంగానే వచ్చింది. ఇక నడపాలంటేనే భారంగా ఉంది,
-వెంకటేశ్వర్‌రెడ్డి, కూకట్‌పల్లి