కార్మిక నేతగా, ఉద్యమకారునిగా నాయిని నర్సింహారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ అన్నారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నాయిని సంతాప సభ నిర్వహించారు. ఈ సభలో ఏఐటీయుసీ ఉపాధ్యక్షుడు నరసింహన్, కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్ సామ వెంకట్ రెడ్డితో పాటు పలువురు కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ సమాజం గొప్ప కార్మిక నాయకున్ని కోల్పోయిందని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మనిషి నాయిని నరసింహా రెడ్డి అని కొనియాడారు. కార్మికమంత్రిగా ఉన్న సయమంలో సైతం కార్మిక పక్షపాతిగా వ్యవహరించారని పేర్కొన్నారు. నిరంతరం కార్మికుల కోసం పరితపించిన వ్యక్తి నాయిని అని కార్మిక సంఘాల నేతలు అన్నారు.
ఇదీ చదవండి: రణ్బీర్-ఆలియా నిశ్చితార్థం రాజస్థాన్లో?