ETV Bharat / state

రాష్ట్రంలో రూ.11,355 కోట్ల పనులకు 8న ప్రధాని మోదీ శ్రీకారం - పరేడ్​ గ్రౌండ్​లో నరేంద్ర మోదీ బహిరంగ సభ

Narendra Modi Hyderabad tour: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన హైదరాబాద్‌లో రూ.11వేల 355 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుడతారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

Narendra Modi
Narendra Modi
author img

By

Published : Apr 3, 2023, 9:48 AM IST

Narendra Modi Hyderabad tour: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న హైదరాబాద్​ వస్తున్న తరుణంలో ఆయన పర్యటనకు సంబంధించి కేంద్రమంత్రి కిషన్​రెడ్డి వివరాలు వెల్లడించారు. మోదీ పర్యటనలో భాగంగా మొత్తం రూ. 11వేల 355 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుడతారని కిషన్​రెడ్డి ప్రకటించారు. తొలుత ప్రధాని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారని.. అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వస్తారని తెలిపారు. అనంతరం తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే రెండో వందేభారత్​ రైలు (సికింద్రాబాద్​ నుంచి తిరుపతి)ను జెండా ఊపి ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

ఆ తరువాత రూ.715 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారని వివరించారు. సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ మధ్య రూ.1,410 కోట్ల వ్యయంతో నిర్మించిన 85 కిలోమీటర్ల డబ్లింగ్‌ రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేస్తారన్నారు. ఎంఎంటీఎస్‌ రెండో దశలో భాగంగా హైదరాబాద్‌ శివారు పట్టణాలతో అనుసంధానం చేస్తూ 13 కొత్త ఎంఎంటీఎస్‌ రైళ్లను ప్రారంభిస్తారని కిషన్​రెడ్డి తెలిపారు.

పరేడ్​ గ్రౌండ్​లో బహిరంగ సభ: తాజాగా చేపట్టనున్న, అందుబాటులోకి వచ్చిన అభివృద్ధి పనులు, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలపై తీసిన ఓ షార్ట్‌ఫిల్మ్​ను ప్రధాని తిలకిస్తారన్నారు. అనంతరం అక్కడ నుంచి ప్రధాని మోదీ నేరుగా పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారని తెలిపారు. అక్కడి నుంచే రూ.7వేల 864 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న జాతీయ రహదారులకు శంకుస్థాపన చేస్తారన్నారు. రూ.1,366 కోట్లతో బీబీనగర్‌ ఎయిమ్స్‌లో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారని వివరించారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారని కిషన్​రెడ్డి తెలిపారు.

40 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా రైల్వేస్టేషన్‌: ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​ను 40 సంవత్సరాల వరకు ప్రయాణికుల అవసరాలకు ఉపయోగపడేలా ఆధునికీకరించనున్నట్లు కిషన్‌రెడ్డి వివరించారు. ప్రస్తుతం రద్దీ సమయంలో 25 వేల మంది ప్రయాణికుల అవసరాలను తీర్చుతుండగా.. ఈ పనులు పూర్తయితే 3.25 లక్షల మందికి సేవలందించేలా స్టేషన్​ సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.

తిరుపతి-సికింద్రాబాద్‌ మధ్య వందే భారత్‌ రైలుతో ప్రయాణ సమయం 8.30 గంటలకు తగ్గుతుందన్నారు. ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రాజెక్టు ద్వారా సామాన్య ప్రజలు అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి వీలవుతుందని వివరించారు. అక్కల్‌కోట్‌-కర్నూలు మధ్య 6 వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి, మహబూబ్‌నగర్‌-చించోలి మధ్య నాలుగు వరుసలు.. కల్వకుర్తి-కొల్లాపూర్, నిజాంపేట-నారాయణ్‌ఖేడ్‌-బీదర్, ఖమ్మం-దేవరాపల్లి మధ్య జాతీయ రహదారి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని కిషన్​రెడ్డి వివరించారు.

ఇవీ చదవండి:

కేసీఆర్‌కు...మోదీని తిట్టడం తప్ప వేరే పని లేదు: బండి సంజయ్‌

కర్ణాటకలో కాంగ్రెస్​ గెలిస్తే.. తెలంగాణలో విజయం మాదే: రేవంత్​రెడ్డి

కునో పార్క్ నుంచి పారిపోయిన నమీబియా చీతా! ఆందోళనలో స్థానికులు!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.