ETV Bharat / state

కాసేపట్లో రాష్ట్రానికి ప్రధాని.. బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి - telangana latest news

PM Narendra Modi Telangana Tour:  ప్రధాని నరేంద్రమోదీ  రాష్ట్రంలో పర్యటించనున్నారు. విశాఖ నుంచి బేగంపేట విమానాశ్రయానికి రానున్న మోదీ... అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వాగత సభలో పాల్గొననున్నారు. భాజపా ముఖ్య నేతలతోనూ భేటీ కానున్న మోదీ.. స్థానిక రాజకీయ అంశాలపైనా చర్చించే అవకాశాలున్నాయి. అనంతరం రామగుండం వెళ్లి ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితంతో పాటు  మూడు జాతీయ రహదారులకు శంకుస్థాపన, భద్రాచలం రోడ్‌-సత్తుపల్లి నూతన రైల్వేలైన్‌ను జాతికి అంకితం  చేయనున్నారు. ప్రధాని పర్యటనలో నిరసన చేపడతామన్న ప్రకటనలతో... పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.

కాసేపట్లో రాష్ట్రానికి ప్రధాని.. బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి

author img

By

Published : Nov 12, 2022, 11:59 AM IST

రామగుండం ఎరువుల కర్మాగారం సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు... ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్న ప్రధానికి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, భాజపా జాతీయ నేత లక్ష్మణ్‌ సహా... రాష్ట్రప్రభుత్వం తరపున తలసాని శ్రీనివాస్ యాదవ్‌ స్వాగతం పలకనున్నారు. ప్రధాని రాష్ట్రానికి రావటం ఈ ఏడాదిలో నాలుగోసారి. విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం ఒకటిన్నరకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న మోదీ.... విమానాశ్రయం బయట భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన స్వాగతసభలో పాల్గొంటారు. 20నిమిషాలపాటు ప్రసంగిస్తారని ఆ పార్టీవర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. ప్రధాని పర్యటన, బేగంపేటలో స్వాగత సభ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అనంతరం హెలికాప్టర్‌లో రామగుండం చేరుకొని... అక్కడ పునరుద్ధరించిన ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం ఇవ్వనున్నారు. ఖాయిలాపడ్డ పరిశ్రమను తిరిగి ప్రారంభించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 6వేల 3వందల 33కోట్లు వెచ్చించాయి. నీమ్‌కోటెడ్‌ యూరియా ఉత్పత్తి కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఎరువుల కర్మాగారాన్ని స్వయంగా పరిశీలించిన అనంతరం... రోడ్డు మార్గాన ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని మహాత్మాగాంధీ క్రీడా మైదానానికి ప్రధాని చేరుకోనున్నారు. మొత్తం 20 వేల మంది వరకు హాజరయ్యే సభా ప్రాంగణం నుంచి మూడు జాతీయ రహదారులకు శంకుస్థాపన, భద్రాచలం రోడ్‌-సత్తుపల్లి నూతన రైల్వేలైన్‌ను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. మోదీ ప్రసంగాన్ని వినేందుకు రైతులతోపాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఆర్​ఎఫ్​సీఎల్​ , ఎన్టీపీసీ ఉద్యోగుల కుటుంబాలు హాజరుకానున్నాయి. రామగుండంలో మోదీ బహిరంగ సభను ప్రజలు తిలకించేందుకు 75అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెరలను ఏర్పాటు చేశారు. ఎరువుల కర్మాగార ప్రాధాన్యత... రైతులకు సమకూరే ప్రయోజనాలను వివరించడమే కాకుండా... నాలుగు కొత్త జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయనున్నారని పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ సంగీత సత్యానారాయణ తెలిపారు.

ప్రధాని పర్యటనలో నిరసనలు తెలుపుతామని పలు పార్టీలు, ప్రజాసంఘాలు చేసిన ప్రకటనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు గంటల పాటు రామగుండంలో సాగనున్న ప్రధాని పర్యటనకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా... ఎస్​పీజీ, సీఐఎస్‌ఎఫ్‌ కేంద్ర బలగాలను సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎన్టీపీసీ క్రీడా మైదానం సమీపంలో ప్రధాని హెలికాఫ్టర్‌ దిగేలా హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. రామగుండం పోలీసు కమిషనరేట్‌ హెడ్‌క్వార్టర్‌లోనూ మరో హెలిప్యాడ్‌ను సిద్దం చేశారు. ఇందులో ఏ హెలిప్యాడ్‌ను వినియోగించుకుంటారో స్పష్టత రాలేదు. మొత్తం 2,500 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్లు CP చంద్రశేఖర్‌ రెడ్డి వివరించారు. సాయంత్రం ఐదున్నరకు ప్రధాని మోదీ రామగుండం పర్యటన ముగియనుండగా...ఆరున్నరకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని...దిల్లీకి తిరుగు పయనంకానున్నారు

తెలంగాణలో అసలైన రాజకీయ ఆట ఇప్పుడే మొదలైంది: కిషన్​రెడ్డి

రామగుండం ఎరువుల కర్మాగారంలో కీలక పరిణామం.. ప్రధాని సందర్శిస్తారా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.