Mann Ki Bath 100 Episode: "మన్ కీ బాత్" అనగా మనసులో మాట. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ఈ కార్యక్రమం యావత్ దేశ ప్రజానీకంపై చెరగని ముద్ర వేసుకుంటోంది. ప్రతి నెల చివరి ఆదివారం ప్రజలను ఉద్దేశించి చేసే రేడియో ప్రసంగం 100 ఎపిసోడ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమాన్ని భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భారతీయులు ఆదరించారు. దేశంలో 4 లక్షలు పైగా ప్రాంతాల్లో తెరలు ఏర్పాటు చేసి ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. సామాన్యలకు మరింత దగ్గరకి తీసుకెళ్లిందని ప్రధాని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలతో చర్చించినట్లు పేర్కొన్నారు.
Modi spoke in the 100th episode of Mann Ki Baat: ప్రకృతి రక్షణ, చెట్లు నాటడం, పేదలకు వైద్యం వంటి అంశాలు తనకు ప్రేరణ కలిగించాయని అభిప్రాయపడ్డారు. 2014 అక్టోబరు 3న విజయ దశమి పర్వదినం నుంచి అధికారికంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ప్రధాన మంత్రి స్వరం, ఆలోచనలను దేశంలోని సామాన్య ప్రజలకు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మొత్తం కార్యక్రమంలో ప్రధాని 22 ధారావాహికల్లో ప్రత్యేకించి వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన విషయాలు.. రైతులు, అంకుర కేంద్రాల వ్యవస్థాపకులు, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి నూతన ఆవిష్కరణలు ఆవిష్కరించే విధంగా స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు.
171 కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు: కేంద్ర ప్రభుత్వం సేంద్రియ, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని స్పష్టం చేశారు. దీని ఫలితంగా దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లోని 171 జిల్లాల్లో 171 కృషి విజ్ఞాన కేంద్రాల్లో భారతీయ జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ సహకారంతో 1398 మంది రైతులు, 1003 మంది వినియోగదారులను సంప్రదించి అభిప్రాయ సేకరణ చేసినట్లు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. శాస్త్రీయ పద్ధతులు అనుసరించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగకరంగా ఉందని రైతులు, వినియోగదారులు తెలిపారు.
వ్యవసాయంలో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చింది: ఈ మొత్తం కార్యక్రమం ప్రజానీకం దగ్గరకు చేర్చేందుకు కృషి విజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తలు చొరవ తీసుకుని వాట్సాప్, ఎస్‌ఎంఎస్, ట్విటర్ వంటి సామాజిక ప్రచార మాధ్యమాలను ఉపయోగించుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సాహిస్తూ మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నాయని మేనేజ్ సంస్థ స్పష్టం చేసింది. "మన్ కీ బాత్" కార్యక్రమం సేంద్రీయ, సహజ వ్యవసాయాన్ని పాటించే విషయంలో గణనీయమైన మార్పులను తీసుకువచ్చేందుకు దోహదపడిందని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించి, స్ఫూర్తిని నింపడం ద్వారా వినియోగ విధానంలో మార్పు తీసుకు వచ్చారని అన్నారు. రైతులు పండించిన సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులతో సంతృప్తి చెందుతున్నారని హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: