ప్రధాని మోదీ, చంద్రబాబు మధ్య ఏడాది కాలం తర్వాత ఫోన్ సంభాషణ జరిగింది. పార్టీ ముఖ్య నేతలతో వీడియో సమావేశం సందర్భంగా ఆయా వివరాలను... చంద్రబాబు వివరించారు. మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు మోదీ ఫోన్ చేశారని నేతలకు చంద్రబాబు చెప్పారు. వైరస్ కట్టడిపై వివిధ రంగాల నిపుణులతో మాట్లాడి సేకరించిన అభిప్రాయాలను ప్రధానికి తెలియజేసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని తనతో పాటు కుటుంబసభ్యుల యోగక్షేమాలు అడిగారని తెలుగుదేశం అధినేత చెప్పారు.
కరోనా నివారణకు చేపట్టాల్సిన చర్యలపై... తన ఆలోచనల్ని ఆయనతో పంచుకున్నానని వివరించారు. ఇంకా పెద్దఎత్తున పరీక్షలు చేయాలని కోరినట్లు.. చంద్రబాబు వెల్లడించారు. సాంకేతికత వినియోగంలో ఉన్న అనుభవంతో... ఎప్పటికప్పుడు తగిన సలహాలు, సూచనలు తన కార్యదర్శికి చెప్పాల్సిందిగా మోదీ కోరారని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇదీ చదవండి : కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడంలో చైనా దూకుడు!