ETV Bharat / state

కరోనాపై పోరులో... స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష

ప్రజల పాలిట అదృశ్య శత్రువై వెన్నాడుతున్న కరోనా వైరస్‌ రోజురోజుకీ చెలరేగిపోతోంది. దాని బారి నుంచి తప్పించుకోవడం అసాధ్యమేమో అన్నంతగా పరిస్థితులు మారిపోతున్నాయి. కేంద్ర మార్గదర్శకాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌మాళ్లు, ప్రార్థనా మందిరాలు తెరచుకోనున్నాయి. జనసమ్మర్దం మరింత పెరగనుంది. ఇప్పటి దాకా లాక్‌డౌన్‌లో పాటించిన నిబంధనల కంటే.. ప్రజలు ఇప్పుడు అనుసరించాల్సిన స్వీయ నియంత్రణలే మరీ మరీ ముఖ్యం.

preventive measures to be safe from corona virus
కరోనాతో కాస్త జాగ్రత్త
author img

By

Published : Jun 8, 2020, 7:07 AM IST

Updated : Jun 8, 2020, 8:45 AM IST

లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం రాష్ట్రంలో వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గత నాలుగు రోజుల్లో.. నిత్యం 100కు పైగానే కేసులు ఉంటున్నాయి. మరణాలు కూడా పెరుగుతున్నాయి. జిల్లాలకూ వైరస్‌ విస్తరించింది. ఈ స్థితిలో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోకపోతే.. పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయని వైద్యఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. వచ్చే నెలలో రోజుకు 400 కేసుల వరకూ నమోదు కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇందులో కరోనా లక్షణాలుండి, ఇతర అనుబంధ ఆరోగ్య సమస్యలున్నవారు రోజుకు 70-100 మంది వరకూ ఉంటారని అంచనా. ఇటువంటి వారిని మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స కోసం చేర్చుకుంటారు. కేవలం కరోనా పాజిటివ్‌గా గుర్తించిన వారిని వారి ఇళ్లలోనే స్వీయ గృహ ఐసోలేషన్‌లో ఉండమంటారు. ఒకవేళ వారి ఇళ్లలో ఆ అవకాశం లేకపోతే.. ప్రభుత్వ ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉంచాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అంటే వచ్చే నెలలో సుమారు 12వేల కొత్త పాజిటివ్‌ కేసులు నమోదైతే.. వీరిలో రెండుమూడు వేల మందికి ఆసుపత్రుల్లో చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇందుకు తగ్గట్టుగా వైద్యఆరోగ్యశాఖ సన్నద్ధమైంది.

లక్షణాలుంటే వెంటనే ఆసుపత్రికి..

సాధారణంగా జలుబు, పొడిదగ్గు, గొంతునొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే.. ఇంట్లోనే మూణ్నాలుగు రోజుల పాటు వేచిచూడడం పరిపాటి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో సంప్రదించాలని ఆరోగ్యశాఖ సూచిస్తోంది. జలుబు.. ముక్కుకారడం వంటివి అందరిలో ఉండకపోవచ్చు. కాబట్టి ఏ మాత్రం ఇతర లక్షణాలున్నా ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి.

జిల్లాల్లోనూ చికిత్స

  • టిమ్స్‌లో చికిత్సకు ఇప్పటికే ప్రభుత్వం పోస్టులను మంజూరు చేసింది. వారం రోజుల్లో నియామక ప్రక్రియను పూర్తి చేసి, కరోనా చికిత్సలను ప్రారంభించనున్నారు.
  • గాంధీ ఆసుపత్రిపైనే పూర్తి భారం పడకుండా ఛాతీ ఆసుపత్రి సేవలను కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకోనున్నారు.
  • వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిలో కరోనా వైరస్‌ను గుర్తించితే.. వారికి నిమ్స్‌లో ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు 250 పడకలను సిద్ధం చేశారు. ఇవి కాకుండా నిమ్స్‌లో ఇతర వైద్యసేవలు యథావిధిగా కొనసాగుతాయి.
  • జిల్లాల్లోనూ కరోనా కేసులు పెరుగుతుండడంతో.. ఇక స్థానికంగానే జిల్లా ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తారు. ఇందుకు తగ్గట్లుగా ఇప్పటికే జిల్లా ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ పైపులైన్లు, ఐసోలేషన్‌ గదులు, ఐసీయూల ఏర్పాటును ముమ్మరం చేశారు.
  • ప్రధానంగా ఆయా జిల్లాల్లోని బోధనాసుపత్రుల్లో చికిత్సకు ప్రాధాన్యమిస్తారు.
  • ప్రైవేటు బోధనాసుపత్రులను కూడా వచ్చే నెలలో వినియోగించడంపై దృష్టిపెట్టారు.
  • తద్వారా రాష్ట్రంలో దాదాపు 15వేలకు పైగా పడకలు అందుబాటులో వస్తాయని ఆరోగ్యశాఖ భావిస్తోంది.
  • క్షేత్ర స్థాయిలోనే కరోనా లక్షణాలున్న వ్యక్తులను గుర్తించడంపైనే ఈ శాఖ ప్రధానంగా దృష్టిపెట్టింది.
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని అన్ని స్థాయుల ఆసుపత్రుల్లోనూ ప్రత్యేకంగా జ్వర క్లినిక్‌లను నిర్వహిస్తోంది.
  • పీహెచ్‌సీల్లోనూ వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి పీపీఈ కిట్లను సరఫరా చేయనున్నారు.
  • త్వరలోనే నిర్ధారణ పరీక్షల కోసం కొన్న కొత్త పరికరం రానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. దీన్ని నిమ్స్‌లోగానీ, ఐపీఎంలోగానీ అందుబాటులో ఉంచుతారు. అప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రోజుకు 3,500కు పైగా పరీక్షలు చేసేందుకు వీలుంటుంది.

ఆలస్యం చేస్తే అనర్థాలు ఎలా ఉన్నాయంటే...

  • గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందినవారిని గమనిస్తే లక్షణాలు కనిపించగానే వెంటనే చికిత్సకు వచ్చినవారిలో అత్యధికులు కోలుకొని ఇళ్లకెళ్తున్నారు.
  • ఆలస్యంగా వచ్చిన వారిలో అప్పటికే శ్వాసకోశ సమస్యలు తీవ్రమై, ప్రాణాంతకంగా మారుతోందని అంచనా వేస్తున్నారు.
  • ఇప్పటి వరకూ చేసిన చికిత్సల్లో.. ముందస్తుగా వచ్చిన వారిలో కేవలం 380 మందికి మాత్రమే ఆక్సిజన్‌ పెట్టాల్సివచ్చింది. వారిలోనూ కేవలం 10 మందిలోపే ఐసీయూ చికిత్స అవసరమైందని నిపుణులు చెబుతున్నారు.
  • సమస్య తీవ్రమై వచ్చినవారిలో.. శ్వాసకోశ సమస్య తీవ్రమై అత్యధికులు ప్రాణాలు కోల్పోయారని విశ్లేషిస్తున్నారు.
  • ప్రాణాలు కోల్పోయినవారిలోనూ 90 శాతం మందిలో ఇతర అనుబంధ ఆరోగ్య సమస్యలున్నట్లుగా గుర్తించారు.
  • సమస్య తీవ్రమైన తర్వాత.. యాంటీ వైరల్‌ ఔషధాలిచ్చినా ఫలితాలు తక్కువేనని వైద్యులు చెబుతున్నారు. వైరస్‌ ప్రభావం తక్కువగా ఉన్నప్పుడైతే పరిస్థితులు తీవ్రంగా పరిణమించకుండా ఔషధాలు అడ్డుకుంటాయని వివరిస్తున్నారు.
  • అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌, గుండెజబ్బు, మూత్రపిండాల జబ్బు, శ్వాసకోశ సమస్యలు.. తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు బయటకు రాకుండా ఉండడమే మంచిదని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి రాష్ట్రంలో మరో 154 కరోనా పాజిటివ్ కేసులు.. 14 మంది మృతి

Last Updated : Jun 8, 2020, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.