ETV Bharat / state

నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి - ఆ మార్గాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు - President Draupadi Murmu Hyderabad Tour Today

President Draupadi Murmu Hyderabad Tour : శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు నగరంలో ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.

President Draupadi Murmu
President Draupadi Murmu
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 18, 2023, 7:14 AM IST

President Draupadi Murmu Hyderabad Tour : ప్రతి శీతాకాలానికి భారత రాష్ట్రపతి హైదరాబాద్​ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి విడిది చేయడానికి వస్తుంటారు. ఈ క్రమంలోనే నేడు హైదరాబాద్​కు దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) రానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లోని పలు చోట్ల ట్రాఫిక్​ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.

President Draupadi Murmu Hyderabad Tour Today : ఈరోజు సాయంత్రం 6:25 గంటలకు రక్షణ శాఖ పరిధిలోని హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోకి (Bollaram Rashtrapati Nilayam) 7:00 గంటలకు ప్రవేశించి సేద తీరి, కొన్ని రోజులు ఇక్కడే ఉండనున్నారు. బొల్లారం నిలయానికి వెళ్లే మార్గాల్లో రాష్ట్రపతి కాన్వాయ్​కు సంబంధించి అధికారులు శనివారం రిహార్సల్ కూడా చేశారు. ఈ ఏర్పాట్లు మొత్తాన్ని సైబరాబాద్​ సీపీ ఏకే మహంతి(Cyberabad CP AK Mohanthy) దగ్గరుండి పర్యవేక్షించారు.

ఎంత ఎదిగినా మన మూలాలు, సంస్కృతి మరవొద్దు: రాష్ట్రపతి

President Draupadi Murmu Visits Bollaram Rashtrapati Nilayam : ద్రౌపది ముర్ము కాన్వాయ్​ వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న నివాసాలపై ఇప్పటికే పోలీసులు, ఇంటెలిజెన్స్​ సిబ్బంది పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి విడిది కాలంలో లోతుకుంట నుంచి ఆంక్షలు అమలు(Traffic Restrictions) చేయనున్నారు. ఈరోజు సాయంత్రం హకీంపేట విమానాశ్రయం నుంచి వై జంక్షన్​, బొల్లారం జంక్షన్​, నేవీ జంక్షన్​, యాప్రాల్​ రోడ్​, బైసన్​ గేట్​, లోతుకుంట జంక్షన్​ వైపు వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నట్లు ట్రాఫిక్​ పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.

Women Reservation Bill President : మహిళా రిజర్వేషన్లకు రాష్ట్రపతి గ్రీన్​సిగ్నల్.. చట్టంగా మారిన బిల్లు.. కేంద్రం గెజిట్

Traffic Restrictions in Hyderabad Today : బొల్లారం రాష్ట్రపతి నిలయానికి శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తుండటంతో అక్కడి నివాసంలో దాదాపు అన్ని పనులను ఉన్నతాధికారులు పర్యవేక్షించి, పూర్తి చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 11 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రపతి నిలయం సందర్శనను రద్దు చేశారు. రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో బందోబస్తును కట్టుదిట్టం చేశారు.

బొల్లారం రాష్ట్రపతి నిలయం చరిత్ర : దేశంలో అత్యున్నమైనది రాష్ట్రపతి పదవి అయితే, అత్యున్నత నివాసం దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌. దీనికి దీటుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ఉంటుది. దేశ పరిపాలనా ఉత్తర భారతానికే పరిమితం కాకూడదన్న ఉద్దేశంతో దక్షిణాన దీన్ని ఏర్పాటు చేశారు. సిమ్లాలోనూ రాష్ట్రపతి భవన్‌ ఉంది. 1805లో బ్రిటీష్‌ అధికారులు బొల్లారం రాష్ట్రపతి నిలయాన్ని నిర్మించారు. అప్పట్లో వైశ్రాయ్‌ అతిథిగృహంగా పిలిచేవారు. దీనికి సమీపంలోని ఆంధ్రసబ్‌ ఏరియా కార్యాలయానికి వచ్చే రక్షణ అధికారులు ఇక్కడ విడిది చేసేవారు. స్వాతంత్య్రం అనంతరం 1950లో కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొంది. అప్పటినుంచి రాష్ట్రపతి నిలయంగా పిలుస్తున్నారు.

ఇకపై సంవత్సరం పొడవునా రాష్ట్రపతి భవనం సందర్శించొచ్చు..

President Speech at Dundigal Air Force Academy : 'ఫైటర్‌జెట్‌ పైలట్లలో మహిళలు ఉండటం సంతోషకరం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.