ETV Bharat / state

ఆర్థిక మాంద్యం ప్రభావం... వచ్చే ఆర్నెల్లూ సవాళ్లే... - ఆర్థిక మాంద్యం ప్రభావం

రాష్ట్ర ఖజానాకు రాబడులు భారీగా తగ్గిన నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్​ కేటాయింపులు సవాళ్లతో కూడుకున్నవే. వచ్చే ఆర్నెల్లూ ఖర్చులు అధికంగా పెరగనున్నాయి. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలతో పాటు కీలకమైన పథకాలకు భారీ మొత్తంలో వెచ్చించాల్సి ఉంది. రాష్ట్ర ఆదాయంపై ఆర్థిక మాంద్యం నీలి నీడలు కమ్ముకున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్​ అందుకు అనుగుణంగా బడ్జెట్​కు తుది రూపు ఇచ్చారు.

ఆర్థిక మాంద్యం ప్రభావం... వచ్చే ఆర్నెల్లూ సవాళ్లే...
author img

By

Published : Sep 9, 2019, 5:09 AM IST

Updated : Sep 9, 2019, 7:39 AM IST

ఆర్థిక మాంద్యం ప్రభావం... వచ్చే ఆర్నెల్లూ సవాళ్లే...

రాష్ట్ర ఆదాయంపై ఆర్థిక మాంద్యం నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. అనుకున్న మేర ఆదాయం ఉండడం లేదు. ఫిబ్రవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఓట్​ ఆన్​ అకౌంట్​ బడ్జెట్​ తీసుకొచ్చినప్పటి నుంచి మారిన పరిస్థితులు ఖజానాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇవాళ ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్​... ఓట్​ ఆన్ బడ్జెట్​​ కంటే తగ్గనుంది. మాంద్యం పరిస్థితులు రాష్ట్ర రాబడులపై మున్ముందు మరింత ఎక్కువవుతాయని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

తగ్గిన పన్ను రాబడులు...

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రాబడి మినహా అన్ని పన్ను రాబడులపై ప్రతికూల ప్రభావం మొదలైంది. ఖజానాకు కీలకమైన అమ్మకం పన్ను ఆదాయం తగ్గింది. జీఎస్టీ రాబడుల్లో సగటున ఏటా 17 శాతం వృద్ధి రేటు కొనసాగుతుండగా ఈసారి 12 నుంచి 14 శాతం మధ్యే ఉంటుందని ఆర్థిక, వాణిజ్య, పన్నుల శాఖల అధికారులు విశ్లేషిస్తున్నారు. మద్యం అమ్మకాల ఆదాయం కూడా ఆర్నెల్ల కాలంలో తగ్గవచ్చనే అంచనాలున్నాయి. రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా గ్రాంట్​ ఇన్​ ఎయిడ్​ల తగ్గుదల కూడా బడ్జెట్​ను ప్రభావితం చేస్తోంది.

ముందంతా 'వ్యయ'కాలమే

అక్టోబరు నుంచి రానున్న ఆర్నెల్లు రాష్ట్రంలో ఖర్చులు భారీగా పెరగనున్నాయి. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలతో పాటు కీలకమైన పథకాలకు భారీ మొత్తంలో వెచ్చించాల్సి ఉంది. సాగునీటి ప్రాజెక్టుల బిల్లుల చెల్లింపు, ఉపకార వేతనాల బకాయిలు చాలా ఉన్నాయి. రైతు బంధు పథకానికి రూ.12 వేల కోట్లు అవసరమని అంచనా వేయగా ఇప్పటికి చెల్లించింది రూ.3,500 కోట్లు మాత్రమే. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్​, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంక్షేమానికి భారీ మొత్తంలో నిధులు కేటాయించాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ వస్తున్న రాబడులకు అనుగుణంగా... అన్ని రంగాలకు న్యాయం చేకూర్చేలా సీఎం కేసీఆర్​ బడ్జెట్​కు తుది రూపునిచ్చారు.

ఇదీ చూడండి : స్విస్ బ్యాంక్ డేటా విశ్లేషిస్తే అన్నీ మూతపడ్డ ఖాతాలే!

Intro:hyd_tg_68_08_trs_meeting_vo_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారు జి ఎం ఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి తెరాస కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఇందులో పార్టీ సభ్యత్వ రుసుము ఎంపీ ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే అందజేశారు
కార్యకర్తలకు పదవులు రాలేదని అధైర్య పడవద్దని భవిష్యత్తులో అవకాశాలు వస్తాయని మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి అన్నారు మున్సిపల్ ఎన్నికల్లో తెరాస జెండా ఎగిరేలా కృషి చేయాలన్నారు కేసీఆర్ నాయకత్వంలో దేశంలో మంచి రాష్ట్రంగా పేరు పొందడం జరిగిందంటే కార్యకర్తల వల్లే అని ఆయన తెలిపారు. మేము ఉన్నత స్థాయిలో ఉన్నామంటే మీ కృషి వల్లే అని ఆయన చెప్పుకొచ్చారు కేటీఆర్ ఆదేశాల మేరకు మున్సిపల్ మండల గ్రామ కమిటీలు వీటికి సంబంధించిన అనుబంధ కమిటీలు వేయడం జరుగుతుందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు మున్సిపల్ 60కి పైగా కౌన్సిలర్లు ఉన్నాయని ఆయన తెలిపారు పటాన్చెరు నియోజకవర్గంలో 55.2 వేల సభ్యత్వాల అయ్యాయని వీటి నగదు 40.48 లక్షలు తెరాస ప్రధాన కార్యాలయం పంపుతున్నామని తెలిపారు అన్ని కమిటీలు ఏర్పాటు చేసి వారికి బాధ్యతలు అప్పజెప్పడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీభూపాల్ రెడ్డి తెలిపారు

Conclusion:బైట్ ప్రభాకర్ రెడ్డి ఎంపీ మెదక్
బైట్ మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే పటాన్చెరు
Last Updated : Sep 9, 2019, 7:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.