పురపాలక ఎన్నికల నిర్వహణ కసరత్తులో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, సంబంధిత అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సమావేశం కానున్నారు.
బ్యాలెట్‌తోనే పుర'పోరు':
పురపాలిక ఎన్నికల సన్నద్ధతపై సమీక్షిస్తారు. ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ఖరారు, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, పోలింగ్ సిబ్బందికి శిక్షణ, శాంతిభద్రతలు, బ్యాలెట్‌పత్రాలు, బాక్సులు సిద్ధంపై చర్చిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ కోసం పురపాలిక శాఖ సంచాలకులు సవరించిన షెడ్యూలు ప్రకటించారు.
వార్డుల వారీగా జాబితా:
వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీ, ప్రకటనతోపాటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. దీని ప్రకారం ఈనెల 12న ముసాయిదా ప్రకటించి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించి ఈనెల 18న తుది జాబితా ప్రకటించాల్సి ఉంది. ఈ మేరకు పురపాలక శాఖ సంచాలకులు శ్రీదేవి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చూడండి: బడ్జెట్ 19: ధరల మోత ఈ వస్తువులపైనే...