ETV Bharat / state

RATION: కొత్త రేషన్​కార్డుదారులకు బియ్యం పంపిణీకి సర్వం సిద్ధం - rice to new ration card holders from august

ఇటీవల కొత్త రేషన్​కార్డులు అందుకున్న లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచి రేషన్​ బియ్యం అందించబోతున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో అర్హులైన సుమారు 8.65 లక్షల లబ్ధిదారులకు వచ్చే నెల నుంచి ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం చొప్పున నాలుగు నెలల పాటు రేషన్ అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

RATION: కొత్త రేషన్​కార్డుదారులకు బియ్యం పంపిణీకి సర్వం సిద్ధం

author img

By

Published : Jul 31, 2021, 10:36 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందజేసిన నూతన రేషన్ కార్డులకు బియ్యం పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఆగస్టు నెల నుంచే వారికి రేషన్ అందించబోతున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో అర్హులైన సుమారు 3,09,083 కొత్త కార్డుల్లోని 8.65 లక్షల లబ్ధిదారులకు వచ్చే నెల నుంచి ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం చొప్పున నాలుగు నెలల పాటు రేషన్ అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇందుకు అదనంగా నెలకు రూ.23.10 కోట్లతో 4 నెలలకు రూ.92.40 కోట్లు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుందని వివరించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎమ్​జీకేఏవై పథకం కింద ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున రాష్ట్రంలోని 53.56 లక్షల ఎన్​ఎఫ్​ఎస్​ఏ కార్డుదారులకు, 33.85 లక్షల రాష్ట్ర కార్డుదారులకు గత మే, జూన్ రెండు నెలలుగా ఉచిత రేషన్ అందించారు. జులై నెలకు సంబంధించిన పంపిణీ ఏర్పాట్లు ముగిసిన తర్వాత గత నెల 24న కేంద్రం నుంచి ఉచిత రేషన్ పొడిగింపుపై అధికారిక సమాచారం అందడంతో జులైలో ఇవ్వవలిసిన 5 కిలోల ఉచిత బియ్యాన్ని ఆగస్టు, 2021 కోటా 10 కిలోలకు కలిపి అదనంగా మొత్తం 15 కిలోలు పంపిణీ చేస్తామని తెలిపారు.

3వ తేదీ నుంచి పంపిణీ..

ఇందుకు గానూ 87.41 లక్షల పాత కార్డుల్లోని దాదాపు 2.80 కోట్ల లబ్ధిదారులకు 7 నెలల కోసం రూ.323.94 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఖర్చు చేయనుంది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 90.50 లక్షల కార్డుల్లోని 2.88 కోట్ల లబ్ధిదారులకు ఉచిత బియ్యం పంపిణీకి గానూ రాష్ట్రప్రభుత్వం సుమారు రూ.416.34 కోట్లు అదనంగా ఖర్చు చేయనుందన్నారు. కొత్త కార్డుల జారీ, అదనపు బియ్యాన్ని చౌక ధరల దుకాణాలకు తరలించాల్సి ఉన్నందున ఆగస్టు నెల పంపిణీ 3వ తేదీ నుంచి ప్రారంభిస్తామని తెలిపారు.

త్వరలోనే నూతన రేషన్​షాపులు..

ఈ నెల 26న రాష్ట్రవ్యాప్తంగా కొత్తరేషన్‌ కార్డుల పంపిణీ పండగ వాతావరణంలో సాగింది. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులు అందించారు. పేదల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా సర్కార్‌ పనిచేస్తోందని ప్రజాప్రతినిధులు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మూడు లక్షల 9 వేల నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో నూతన రేషన్ షాపులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి: Ration cards: రెండేళ్ల నిరీక్షణకు తెర.. రేషన్​ కార్డుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.