ETV Bharat / state

BANDI SANJAY: పాదయాత్రలో సంజయ్​ ఎక్కడ బస చేయాలి? ఎక్కడ మాట్లాడాలి..? - Bandi Sanjay latest news

ఈ నెల 24 నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న పాదయాత్రకు సంబంధించి కమిటీ సభ్యులు ఏర్పాట్లను పరిశీలించారు. పాదయాత్ర రూట్​ మ్యాప్​, బస చేసే ప్రాంతాలు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడేందుకు అనువైన స్థలాలను గుర్తించారు. హైదరాబాద్ పాతబస్తీ భాగ్యలక్ష్మీ ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.

BANDI SANJAY: బండి సంజయ్​ పాదయాత్రకు సన్నాహాలు షురూ

author img

By

Published : Aug 10, 2021, 6:08 PM IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 24 నుంచి చేపట్టనున్న పాదయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్, సభా స్థలి, రాత్రి బస చేసే ప్రాంతాలను ఖరారు చేసే పనిలో పాదయాత్ర కమిటీ సభ్యులు నిమగ్నమయ్యారు. ఈ మేరకు పాదయాత్ర నిర్వహణా కమిటీ సహ ఇంఛార్జీ లంకల దీపక్ రెడ్డి, సభ్యులు వెంకట్ రెడ్డి, భాజపా హైదరాబాద్ సెంట్రల్, గోల్కొండ-గోషామహల్, రంగారెడ్డి రూరల్, సంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు గౌతమ్​రావు, పాండు యాదవ్, బొక్క నర్సింహారెడ్డి, ఎం. నరేందర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ప్రకాశ్​లు హైదరాబాద్, రంగారెడ్డి రూరల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని ప్రాంతాల్లో పర్యటించారు. సభా స్థలి, భోజన, వసతి, రక్షణ ఏర్పాట్ల కోసం ఆయా ప్రాంతాల్లోని స్థలాలను పరిశీలించారు.

పాదయాత్ర సందర్భంగా గోల్కొండ కోట, ఆరె మైసమ్మ దేవాలయం, మొయినాబాద్ క్రాస్​రోడ్, చేవేళ్ల క్రాస్ రోడ్, మన్నెగూడ చౌరస్తా, వికారాబాద్, మోమిన్​పేట, సదాశివపేట ప్రాంతాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడేందుకు అనువైన స్థలాలను గుర్తించారు. బండి సంజయ్ పాదయాత్ర కోసం ప్రజలు, పార్టీ శ్రేణులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని.. తమ తమ గ్రామాల గుండా పాదయాత్ర నిర్వహించేలా చూడాలంటూ పాదయాత్ర కమిటీల సభ్యులను కోరినట్లు వారు తెలిపారు.

పాదయాత్ర వాయిదా..

మొదటగా ఆగస్టు 9 నుంచి బండి సంజయ్​ పాదయాత్ర నిర్వహించాలనుకున్నారు. ఆగస్టు 13 వరకు పార్లమెంటు సమావేశాలు ఉండటం, కీలకమైన బిల్లులు సభ ముందుకు రానున్న దృష్ట్యా.. పాదయాత్ర వాయిదా వేశారు. పాదయాత్ర ప్రారంభం నాడు కీలక జాతీయనేత లేదా ముఖ్యమైన కేంద్ర మంత్రిని ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం.

సంబంధిత కథనాలు..

BJP: 24 నుంచి సంజయ్ పాదయాత్ర.. ఓల్డ్​సిటీ నుంచే ప్రారంభం

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర వాయిదా.. ఎందుకంటే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.