ETV Bharat / state

రైతులకు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టిన అకాల వర్షాలు

రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తోన్న అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికందే సమయంలో నీటిపాలవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత నష్టం జరగక ముందే.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు.

తెలంగాణలో అకాల వర్షాలు
తెలంగాణలో అకాల వర్షాలు
author img

By

Published : Apr 14, 2021, 8:25 PM IST

తెలంగాణలో అకాల వర్షాలు

రాష్ట్రంలో అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. పంటలు చేతికొచ్చే దశలో కురుస్తున్న వానలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్లాలు, మార్కెట్​ యార్డుల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోతోంది. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి నేలకొరిగి ధాన్యం నేలరాలింది. మరికొన్నిచోట్ల ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. వరంగల్ గ్రామీణ జిల్లాలోని వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లోనూ వర్షాలు రైతులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. ఈదురుగాలులతో వరి, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. ఐనవోలు కక్కిరాలపల్లిలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న పసుపు, మిర్చి, మొక్కజొన్న తడిసింది. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలో ఈదురుగాలులతో మామిడి కాయలు నేలరాలాయి.

కరీంనగర్​ జిల్లాలో..

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్​ మండలాల్లో ఒక్కసారిగా విరుచుకుపడిన వర్షం రైతులను నష్టాల పాలుచేసింది. మార్కెట్​ యార్డులు, కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసింది. ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. హుజూరాబాద్​ వ్యవసాయ మార్కెట్ యార్డులో కొత్తపల్లికి చెందిన సుమారు 60 మంది రైతుల ధాన్యం వాననీటితో కాకతీయ ప్రధాన కాలువలో కొట్టుకుపోయింది.

సిద్దిపేట జిల్లాలో..

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ డిపో గ్రౌండ్​లో రైతులు ఆరబోసిన ధాన్యం వాననీటికి తడిసి ముద్దయింది. వ్యవసాయ మార్కెట్ యార్డు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో డిపో గ్రౌండ్​లో ఆరబోసుకుంటే టార్పాలిన్ కవర్లు సరిపోక ధాన్యం తడిసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

వనపర్తి జిల్లాలో..

వనపర్తి జిల్లా కొత్తకోట, మదనాపురం మండలాల్లో వర్షానికి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. గాలులకు వరి పంట నేలకొరిగింది. అజ్జకొల్లులో ఆరబెట్టిన సుమారు 25 వేల బస్తాల ధాన్యం తడిసిపోయింది.

రైతుల డిమాండ్​..

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్గాం గ్రామ రైతులు రాస్తారోకో చేశారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని త్వరగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.