"గో సడక్ బంద్"కు పిలుపునిచ్చిన యుగతులసి ఫౌండేషన్ సభ్యులను పోలీసులు అరెస్టులు చేశారు. గో హత్యలు నివారించాలని, గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ యుగతులసి ఫౌండేషన్ సడక్ బంద్‌కు పిలుపునిచ్చింది. భారీగా తరలివచ్చిన గో సంరక్షకులతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఎల్బీనగర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించడంతో పోలీసులు భారీగా మోహరించారు.
యుగతులసి ఫౌండేషన్ ఛైర్మన్ శివకుమార్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, మీర్‌పేట్ ప్రాంతాల్లో గో భక్తులను అరెస్టు చేశారు. ఈ నెల 15న చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి బహదూర్‌పుర వరకు పాదయాత్ర చేపడతామని శివకుమార్ తెలిపారు. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.