ETV Bharat / state

కరోనా కాలంలో గర్భిణుల తిప్పలు - ఏపీలో కరోనా కష్టాలు

కరోనా మహమ్మారి గర్భిణులకు శాపంగా మారింది. కొవిడ్ సోకిన గర్భిణులకు ప్రసవం చేయడానికి ఆసుపత్రి సిబ్బంది నిరాకరిస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్న ఏపీకి చెందిన ఓ మహిళను.. ఆమె కుటుంబీకులు లాక్‌డౌన్‌ కష్టాలను దాటుకుంటూ హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తీసుకురావడానికి అష్టకష్టాలు పడ్డారు.

pregnants problems in covid crisis
గర్భిణుల తిప్పలు
author img

By

Published : May 19, 2021, 10:18 AM IST

మాయదారి కరోనా.. మానవ లోకాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది. ప్రసవం కోసం ఓ నిండు గర్భిణి సుమారు 460 కిలోమీటర్లు.. ప్రయాణించాల్సిన దుస్థితి తీసుకొచ్చింది. ఏపీ, తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన ఓ గర్భిణి (23)కి నెలలు నిండడంతో.. ప్రసవం కోసం ఓ స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొవిడ్‌ పరీక్ష చేయించుకుని రావాలని అక్కడి వైద్యులు సూచించారు. పరీక్షలో పాజిటివ్‌ అని తేలడంతో ఆపరేషన్‌కు అక్కడి వైద్యులు నిరాకరించారు. అమలాపురం, కాకినాడలోని అన్ని ఆసుపత్రులు తిరిగి అలసిపోయినా ఆమెను చేర్చుకోవాడానికి.. చివరకు ఓ కార్పొరేట్‌ ఆసుపత్రి ముందుకొచ్చింది.

గర్భిణికి అనస్తీషియా ఇచ్చినా మత్తు రావడం లేదని గుర్తించిన వైద్యులు రక్త పరీక్షలు జరిపారు. రక్తంలో సీఆర్‌పీ స్థాయి ఎక్కువ ఉందంటూ.. ప్రసవం చేయలేమని చేతులెత్తేశారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. కుటుంబీకులు హుటాహుటిన రూ.80 వేలు కట్టి ఓ అంబులెన్స్‌లో మంగళవారం ఉదయాన్నే హైదరాబాద్‌కు వచ్చారు. తాము చికిత్స చేయలేమంటూ అక్కడి వైద్యులు.. ఆ మహిళను మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.

రెండు కార్పొరేట్‌ ఆసుపత్రులను సంప్రదించగా.. ఒకరు కొవిడ్‌ పూర్తిగా తగ్గాక డెలివరీ చేస్తామని, మరో ఆసుపత్రిలో రోజుకు రూ.లక్ష ఖర్చు అవుతుందని చెప్పడంతో కుటుంబీకులు వెనకంజ వేశారు. మధ్యాహ్న సమయంలో అక్కడి స్థానిక ప్రజాప్రతినిధి, ఓ ఆసుపత్రి యాజమాన్యం చొరవ చూపి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బెడ్‌ ఇప్పించారు. బుధవారం ఉదయం కాన్పు అయ్యే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదీ చదవండి: కొవిడ్ మారణహోమం- ఒక్కరోజే 4,529మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.