ETV Bharat / state

'ప్రజా పాలన'కు పోటెత్తిన దరఖాస్తులు - అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసిన అధికారులు - telangan prajapalana

Prajapalana Program in Telangana : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తుంది. మూడో రోజు అభయహస్తం దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు బారులు తీరారు. జనం తాకిడితో ప్రజాపాలన కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. మరోవైపు ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు అదనంగా కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు.

GHMC Commissioner Visit To prajapalana Centers
Prajapalana Program in Telangan
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2023, 9:12 PM IST

3వ రోజు ప్రజాపాలన - రేషన్​ కార్డు కోసం దరఖాస్తు ఫారం లేదంటూ క్లారిటీ

Prajapalana Program in Telangana : రాష్ట్ర ప్రజల కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను (Six Guarantees) ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా బండారుపల్లి గ్రామంలో చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె రేషన్ కార్డులేని వారు కూడా మహాలక్ష్మి పథకానికి అర్హులవుతారని తెలిపారు. ఇప్పుడు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోలేని వారికి తిరిగి నాలుగు నెలల తర్వాత అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

GHMC Commissioner Visit To prajapalana Centers : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై ప్రభుత్వం ఎలాంటి దరఖాస్తు ఫారాలు విడుదల చేయలేదని జీహెచ్​ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ స్పష్టం చేశారు. సామాజిక మాద్యమాల్లో కనిపిస్తున్న దరఖాస్తు నిజం కాదని తెలిపారు. అలాగే రేషన్ కార్డుకు (Ration Card) సంబంధించి ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే, తెల్లకాగితంపై కుటుంబ సభ్యుల వివరాలు రాసి తమ సిబ్బందికి ఇవ్వాలన్నారు. యూసఫ్‌గూడ, చిక్కడపల్లిలోని పలు వార్డు కార్యాలయాలను సందర్శించిన రోనాల్డ్‌ రాస్‌ వేరే ఇతర సమస్యలను చెప్పుకునేందుకు కౌంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు.

ప్రజల సమస్యలను పరిష్కారించడానికే ప్రజాపాలన చేపట్టాం : సీతక్క

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు రాష్ట్ర సర్కార్‌ ఆరు గ్యారంటీల పథకాలను ప్రవేశ పెట్టిందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల ప్రజాపాలన కేంద్రాన్ని సందర్శించిన ఆయన, ప్రజలంతా ఆత్మగౌరవంతో జీవించే విధంగా ప్రభుత్వ పని చేస్తుందన్నారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో ఏర్పాటు చేసిన అభయహస్తం దరఖాస్తుల (Abhayahastham Form) స్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫిజ్ పేట్ ప్రేమ్​నగర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రానికి ప్రజలు బారులు తీరారు. అధిక సంఖ్యలో జనాలు రావడంతో పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ప్రజాపాలన కౌంటర్లను పరిశీలించిన శేరిలింగంపపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అదనంగా మరో నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రజల వద్దకు పాలన - ఐదు గ్యారంటీలు హామీ తీర్చినట్టేనా?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ప్రజాపాలన కార్యక్రమం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆరుగ్యారంటీ పథకాలు అమలు జరిగేనా అంటూ ఓ వ్యక్తి వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ నేతలు, స్థానికుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువురి మధ్య తోపులాట పెరగడంతో పోలీసులు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగించారు.

రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమం - ఐదు గ్యారంటీల దరఖాస్తులు ఇచ్చేందుకు పోటెత్తిన జనం

నగరంలో 40 లక్షల అప్లికేషన్ ఫారాలు అందుబాటులో ఉంచామన్న రోనాల్డ్‌ రోస్‌ ప్రతిరోజు మూడున్నర లక్షల దరఖాస్తులు వస్తున్నాయన్నారు. అభయహస్తం దరఖాస్తుల స్వీకరణకు రేపటి నుంచి రెండు రోజులు సెలవు ప్రకటించామని తిరిగి జనవరి 2 నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.

ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రజాపాలన : మంత్రి ఉత్తమ్‌కుమార్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.