అర్హులకు డబుల్ బెడ్రూమ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఖైరతాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. జోన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు సాయి శేషగిరిరావు హాజరయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సుమారు 10లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని శేషగిరిరావు గుర్తు చేశారు. కార్యాలయంలో పేరుకు పోయిన దరఖాస్తులను అధికారులు కనీసం పరిశీలించడం లేదంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు అవుతున్నా.. ప్రభుత్వం ఇప్పటివరకు పేదలకు ఇళ్లను కేటాయించలేదని శేషగిరిరావు మండిపడ్డారు. నియోజకవర్గానికి 4వేల చొప్పున ఇళ్లను కేటాయిస్తామని చెప్పి, సీఎం మాట తప్పారని విమర్శించారు. ప్రభుత్వం స్పందించకుంటే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: కేటీఆర్ సొంత నిధులతో గంభీరావుపేట రైతు వేదిక నిర్మాణం