Power Peak Demand: రాష్ట్రంలో భారీగా విద్యుత్ వినియోగం పెరిగిపోతోంది. ఇవాళ సాయంత్రం 3.54 నిమిషాలకు 13,857 మెగా వాట్ల విద్యుత్ వినియోగం పెరిగినట్లు విద్యుత్ శాఖ వెల్లడించింది. ఇవాళ నమోదైన విద్యుత్ వినియోగం రాష్ట్ర చరిత్రలోనే అత్యధికమని అధికారులు భావిస్తున్నారు. 3 రోజుల క్రితం 13,742 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన వ్యవసాయం, పరిశ్రమలు,నీటిపారుదల ప్రాజెక్టులకు విద్యుత్ డిమాండ్ పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు.
ఒకటి రెండు రోజుల్లోనే 14,000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 18,000 మెగా వాట్ల విద్యుత్ వినియోగం డిమాండ్ వచ్చిన సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలు నిరంతరం పని చేస్తాయని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: