మింట్ కాంపౌండ్‌లో తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు సుమారు 3 గంటల పాటు మహాధర్నా చేపట్టారు. ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని, విద్యుత్ ఉద్యోగులకు ఈపీఎఫ్ కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగులతో సమానంగా ఆర్టిజన్లను గుర్తించాలన్నారు. లేకపోతే ఈ నెల 23న వరంగల్లో నిర్వహించే సభలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని విద్యుత్ ఉద్యోగులు హెచ్చరించారు.
ఇవీ చూడండి:"సర్కారు స్పందిచలేదు.. సమ్మెపై వెనక్కి తగ్గేదిలేదు"