ETV Bharat / state

పౌల్ట్రీ ఇండియా- 2022.. ప్రపంచస్థాయి పౌల్ట్రీ పరికరాలతో ఆహ్వానం

Poultry India- 2022 Exhibition at Hyderabad: వ్యవసాయ అనుబంధ రంగమైన పౌల్ట్రీలో వస్తున్న విప్లవాత్మక మార్పులు రైతులకు పరిచయం చేసేలా హైదరాబాద్‌లో పౌల్ట్రీ ఇండియా- 2022 ప్రదర్శన జరుగుతోంది. పౌల్ట్రీకి సంబంధించిన అన్నిరకాల ఉత్పత్తులన్నీ ఒకేచోట కొలువుదీరాయి. మూడురోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ ప్రదర్శనకు పౌల్ట్రీ రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వందల రకాల ఉత్పత్తులను ఇక్కడ స్టాల్స్‌లో ప్రదర్శనకు ఉంచి, వాటి పనితీరు గురించి అవగాహన కల్పిస్తున్నారు.

author img

By

Published : Nov 25, 2022, 3:31 PM IST

Poultry India- 2022 Exhibition
Poultry India- 2022 Exhibition
హైదరాబాద్‌లో పౌల్ట్రీ ఇండియా- 2022.. ప్రపంచస్థాయి పౌల్ట్రీ పరికరాలు

Poultry India- 2022 Exhibition at Hyderabad: ఇండియన్‌ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్‌, మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్‌ సంయుక్తంగా 14వ పౌల్ట్రీ ఇండియా- 2022” పేరిట నిర్వహిస్తున్న ప్రదర్శన కొనసాగుతోంది. కొవిడ్ కారణంగా రెండేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ ఎక్స్‌పోకు విశేష స్పందన లభిస్తోంది. ఈ నెల 23న హైదరాబాద్‌ హైటెక్స్‌లో ప్రారంభమైన ఈ ప్రదర్శన మూడురోజుల పాటు సాగుతోంది.

మన దేశం నుంచి 331 ప్రసిద్ధ సంస్థలు సహా.. అమెరికా, చైనా, ఐరోపా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ తదితర దేశాల నుంచి 370 సంస్థలు ఇందులో భాగస్వామ్యయ్యాయి. తక్కువ పెట్టుబడితో అధిక ఉత్పత్తి, ఉద్పాదకత సాధించేందుకు దోహదపడే విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలు గల పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్‌, మెషనరీస్ ఈ ప్రదర్శనలో అందుబాటోలు ఉన్నాయి.

కేజ్‌లు, ఎగ్ కలెక్షన్ సిస్టం, పీపీ బెల్డ్, ఎవాపరేటింగ్‌, కూలింగ్ ప్యాడ్స్, కొత్త కొత్త బ్రీడ్స్, ఫీడ్, మెడిసిన్ వంటివి ప్రదర్శిస్తున్నారు. అదే విధంగా స్ట్రోమ్ కోన్ ఫ్యాన్లు, వాటరింగ్‌, ఫీడింగ్, వెంటిలేషన్, హౌసింగ్, బర్డ్ ట్రాన్స్‌ఫర్టేషన్, ఆర్టికల్ ఫామింగ్ పద్ధతులను ఈ ప్రదర్శనలో వివరిస్తున్నారు. "కల్తీ చేయనిది, కల్తీ కానిది.. స్వచ్ఛమైన గుడ్డు ఒక్కటే. రోజు రెండు గుడ్లు తినండి.. నిండు ఆరోగ్యంగా జీవించండి" అన్న నినాదం ఈ ప్రదర్శనలో జోడించడంతో విశేషంగా ఆకట్టుకుంటోంది.

అత్యుత్తమ పోష్టికాహారం ఇచ్చే ఫీడ్‌, బయో టెక్నాలజీ ఔషధాలు, బ్యాటరీ కేజెస్‌, బ్యాచింగ్ బిన్స్, హోప్పర్స్, ఫీడ్ కన్వేయర్స్, ఫీడ్ మీల్ ఆటోమేషన్, ప్రొటీన్ ఎనలైజర్ టెక్నాలజీ అద్భుతంగా ఉంది. ఇవాళ రాత్రి ముగియనున్న ఈ ప్రదర్శనకు ఉచిత ప్రవేశం కల్పిన దృష్ట్యా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.