తమకు ఆసరా అవుతుందనుకున్న కాలంలో కరోనా వారి ఆశల్ని వమ్ము చేసింది. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతూ.. తమ కుటుంబాలు పస్తులు పడుతున్న వేదన చూడలేక కుమ్మరులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో ఆంజనేయులు అనే కుమ్మరి మండుటెండలో రోడ్డు ప్రక్కన కూర్చుని ఒళ్లో మట్టి కుండ పెట్టుకుని అమ్మాలని చేసిన ప్రయత్నం చూస్తే కలిచివేయక మానదు. చాలా రోజులుగా అలా చేస్తున్నా.. ఒక్క కుండా అమ్ముడుపోక కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. వేసవి వచ్చినప్పటి నుంచి లాక్డౌన్తో కుమ్మరుల బతుకు దుర్భరమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గతంలో ఈ సమయంలో ప్రతి రోజు వంద వరకు మట్టి కుండలు అమ్మి.. కాస్తో.. కూస్తో లాభం కళ్లచూసేవారమని చెబుతున్నాడు. ప్రభుత్వం తమలాంటి వారిని ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
ఇవీ చూడండి: తెరుచుకున్న మద్యం దుకాణాలు.. ఆనందంలో మందుబాబులు