హైదరాబాద్లోని అబిడ్స్ డాక్ సదన్ ఎదుట తపాలాశాఖ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. కరోనా విజృంభన తగ్గే వరకు ఇంటింటికి బట్వాడా బంద్ చేయాలని... రోస్టర్ పద్ధతిన 50 మంది ఉద్యోగులే విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని నేషనల్ ఫెడరేషన్ పోస్టల్ ఉద్యోగుల సంఘం, ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్, భారతీయ ఉద్యోగుల సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు.
ప్రతి ఉద్యోగికి పీపీఈ కిట్లు పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ప్రతి కార్యలయాన్ని వారానికి రెండుసార్లు శానిటైజ్ చేయాలన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో ముగ్గురు ఉద్యోగులు మరణించగా... 35 మందికి పాజిటివ్ వచ్చిందని... 40 మంది హోమ్ క్వారెంటైన్లో ఉన్నారని నేసనల్ ఫెడరేషన్ పోస్టల్ ఉద్యోగుల సంఘం కన్వీనర్ ప్రసాద్ తెలిపారు. తమ డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం వల్లే... తాము ఆందోళనకు దిగినట్టు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్.. స్మార్ట్ఫోన్ కానుక