ETV Bharat / state

28,057 పోస్టల్‌ బ్యాలెట్‌ అఫ్లికేషన్లు ఆమోదం

Postal Ballots Applications in Telangana Election : ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ.. పోస్టల్‌ బ్యాలెట్‌, హోం ఓటింగ్‌ కోసం వచ్చిన దరఖాస్తులను ఎన్నికల సంఘం స్వీకరించింది. ఇందులో సగం మాత్రమే ఆమోదం అయ్యాయని తెలిపింది. అలాగే ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో నాలుగు బ్యాలెట్‌ యూనిట్లను వినియోగించనున్నారు.

Postal Ballots Applications
Postal Ballots Applications in Telangana Election
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 16, 2023, 10:02 PM IST

Postal Ballots Applications in Telangana Election : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లను చేస్తుంది. ఈ క్రమంలో పోస్టల్‌ బ్యాలెట్‌, హోం ఓటింగ్‌, ఈవీఎం(EVM)ల కేటాయింపు వంటి పనుల్లో నిమగ్నమైంది. ఇందులో భాగంగా పోస్టల్‌ బ్యాలెట్‌(Postal Ballot), హోం ఓటింగ్‌ కోసం వచ్చిన దరఖాస్తుల్లో సగం మాత్రమే ఆమోదం అయ్యాయని ఎన్నికల సంఘం తెలిపింది.

80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటుహక్కును ఇంటి వద్దే వినియోగించుకునేలా హోం ఓటింగ్‌ సదుపాయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఎన్నికల విధుల్లో ఉండే 13 శాఖలు, విభాగాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బందికి కూడా ఈ మారు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని కల్పించారు. అర్హుల నుంచి ఫారం 12డీ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహాలో మొత్తం 44,097 దరఖాస్తులు వచ్చాయి.

Telangana Election 2023 : ఆ దరఖాస్తులను అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించారు. అన్ని రకాల వివరాలు, ధ్రువపత్రాలను పరిశీలించి అందులో 28,057 దరఖాస్తులను ఆమోదించారు. ఆమోదం పొందిన వారు హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. అత్యధికంగా సిద్దిపేట నియోజకవర్గంలో 757 దరఖాస్తులు ఆమోదం పొందాయి. బాల్కొండలో 707, సత్తుపల్లిలో 706 దరఖాస్తులను ఆమోదించారు. అతి తక్కువ సంఖ్యలో బహదూర్ పురాలో 11.. అలంపూర్, జహీరాబాద్ లో 12 చొప్పున.. గద్వాల, గోషామహల్ లో 15 చొప్పున.. దరఖాస్తులు ఆమోదం పొందాయి.

Telangana Assembly Elections 2023 : శాసనసభ ఎన్నికల కసరత్తు వేగవంతం.. ఆ విషయాలపై ఈసీ ఆరా

ఎల్బీనగర్‌కు నాలుగు బ్యాలెట్‌ యూనిట్లు కేటాయింపు : శాసనసభ ఎన్నికల్లో గరిష్ఠంగా ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో నాలుగు బ్యాలెట్ యూనిట్లను వినియోగించనున్నారు. అక్కడ 48 మంది అభ్యర్థులు పోటీలో ఉండడమే ఇందుకు కారణం. ఈవీఎంలో వినియోగించే బ్యాలెట్ యూనిట్ లో గరిష్టంగా 16 చొప్పున అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు నోటా కూడా ఉంటుంది కావున.. ఎల్బీనగర్ లో మొత్తం నాలుగు బ్యాలెట్ యూనిట్లను వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

15, అంతకంటె తక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజకవర్గాల సంఖ్య 54 గా ఉంది. ఆ నియోజకవర్గాల్లో నోటా కలిపితే 16 పేర్లు బ్యాలెట్‌లో ఉంటాయి. దీంతో ఈ 54 నియోజకవర్గాల్లో ఒకే బ్యాలెట్ యూనిట్ అవసరం అవుతుంది. 16 నుంచి 31 మంది లోపు అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజకవర్గాలు 55 ఉన్నాయి. ఇక్కడ ఒక్కో పోలింగ్ కేంద్రంలో రెండు చొప్పున బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తారు. ఇక 32 నుంచి 47 లోపు మంది అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాల సంఖ్య తొమ్మిది. ఆ నియోజకవర్గాల్లోని ఒక్కో పోలింగ్ కేంద్రంలో మూడు చొప్పున బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయి.

E-Vote App: పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా ఇంటి వద్ద నుంచే ఓటేయొచ్చు!

Election CREA-THON 2023 Contest : ఓటర్లను ఆకర్షించే పోస్టర్​, వీడియో రూపొందించండి.. రూ.20 వేలు గెలుచుకోండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.