స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమం చేయలేదని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కాంగ్రెస్ అధిష్ఠానానికి లేఖ రాసిందని తామేనని..42 మంది ఎమ్మెల్యేలు సంతకం పెడితే అందులో మొదటి సంతకం తనదేనని ఆయన తెలిపారు.
సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఇందిరా భవన్లో ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమంలో పొన్నాల ప్రసంగించారు. కేసీఆర్ రాజకీయాల కోసం భావోద్వేగాలను రెచ్చగోడుతున్నారని పొన్నాల విమర్శించారు. ప్రస్తుత రాజకీయాలను సానుభూతి, భావోద్వేగాలు శాసిస్తున్నాయని అన్నారు.
అభివృద్ధిపై చర్చకు సిద్ధం: గీతారెడ్డి
నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని మాజీ మంత్రి గీతారెడ్డి పేర్కొన్నారు. అవినీతి, స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్న వారిని ఓడిద్దామని ఆమె పిలుపునిచ్చారు.