రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులకు సంబంధించి తాజాగా పాలిసెట్-2020 నోటిఫికేషన్ వెలువడింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అందిస్తోన్న వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలను పాలిసెట్-2020 ఆధారంగా చేపట్టనున్నారు. ఈ నెల 2న స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్(ఎస్బీటీఈటీ) పాలిసెట్-2020 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో అందిస్తున్న 3 ఏళ్ల వ్యవసాయ ఇంజినీరింగ్ డిప్లొమా, 2 ఏళ్ల వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పాలిసెట్-2020 పొందిన ర్యాంకుల ఆధారంగా జరుపుతారు.
ఇందుకు సంబంధించిన వివరాలును పాలిసెట్ నోటిఫికేషన్‌తోపాటు విడుదల చేసిన మార్గదర్శకాల్లో అందించారు. పాలిసెట్-2020 దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి గడువు ఏప్రిల్ 4వ తేదీ. వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్ అన్నారు. పాలిసెట్‌లో ర్యాంకులు పొందిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ద్వారా విధిగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని... మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు ఖాళీలను బట్టి వర్సిటీ నియమ నిబంధనల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తామని రిజిస్ట్రార్ ప్రకటించారు. పాలిసెట్-2020 సంబంధించిన వివరాలు, ఆన్‌లైన్ దరఖాస్తులకు www.polycetts.nic.in, www.sbtet.telangana.gov.in వెబ్‌సైట్లను సంప్రదించాలని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: టెస్కాబ్ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ పదవులు ఏకగ్రీవం