రేపటి నుంచి జరగాల్సిన పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదా పడింది. ఈనెల 17 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. పాలిటెక్నిక్ అనుబంధ కళాశాలల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాకపోవడం, సీట్ల సంఖ్య తేలకపోవడం వంటి కారణాల వల్ల మూడు రోజులు వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. సవరించిన షెడ్యూలు ప్రకారం... విద్యార్థులు ఈనెల 17 నుంచి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు, ప్రాసెసింగ్ రుసుము చెల్లింపు, స్లాట్ బుకింగ్ పూర్తి చేయాలి. స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఈ నెల 18 నుంచి 21 వరకు ధ్రువపత్రాల పరిశీలను హాజరు కావాలి.
జూన్ 1 నుంచి తరగతులు
ఈ నెల 18 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కన్వీనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. 25న సీట్లు కేటాయిస్తామని... 25 నుంచి 28 వరకు ఆన్లైన్ బోధన రుసుము చెల్లించి... కళాశాలలకు రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని అన్నారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో భానుడి భగభగలు.. జనాలు బెంబేలు