ETV Bharat / state

అసెంబ్లీ సమరానికి సై అంటున్న భాగ్యనగరం - పోలింగ్ ఏర్పాట్లలో బిజీగా అధికార యంత్రాంగం - గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎన్నికల ఏర్పాట్లు

Polling Arrangements in Greater Hyderabad : పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో.. అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. హైదరాబాద్‌లో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. పోలీస్‌, ఎన్నికల అధికారులు సమన్వయం చేసుకొని ఓటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సమీక్షిస్తున్నారు. ఈవీఎంల తరలింపు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితాను సిద్ధం చేసి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

Polling Arrangements in Greater Hyderabad
Polling Arrangements
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 24, 2023, 9:39 AM IST

అసెంబ్లీ సమరానికి సై అంటున్న భాగ్యనగరం

Polling Arrangements in Greater Hyderabad : ఎన్నికల ప్రచార గడువు సమీపిస్తుండటంతో ఆయా అభ్యర్థుల ప్రచారాలతో నగరం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీ సాయంత్రంతో ప్రచార గడువు సమయం ముగుస్తుంది. 30వ తేదీన పోలింగ్ ఉంటుంది. సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు సైతం ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఓవైపు ప్రచారం సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించకుండా పరిశీలిస్తున్న అధికారులు.. మరోవైపు పోలింగ్​కు ఏర్పాట్లు చేస్తున్నారు.

GHMC Polling Arrangements 2023 : హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్‌ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రోస్‌తో పాటు పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో మొత్తం 1700ల ప్రాంతాల్లో 4119 పోలింగ్ కేంద్రాలున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయలు, సిబ్బంది కేటాయింపు, ఈవీఎంల తరలింపు, బందోబస్తు వంటి అంశాలపై అధికారులు దృష్టి పెట్టారు. సాంకేతికతను ఉపయోగించుకొని పోలింగ్ కేంద్రాల వద్ద నిఘా పెట్టేలా జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రోస్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. వెబ్‌కాస్టింగ్ చేసేలా చర్యలు చేపడుతున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ సిబ్బందికి అదనంగా ప్రత్యేక పరిశీలకులను విధుల్లో ఉంచనున్నారు. ఈవీఎంలు తరలించే వాహనాలకు జీపీఎస్ అమర్చనున్నారు.

ఆఖరి ఘట్టానికి చేరుకున్న ఎన్నికల ప్రచారం-ఐదు రోజుల పాటు జాతీయ నేతల కోలాహలం

Telangana Assembly Elections 2023 : సమస్యాత్మక పోలీంగ్ కేంద్రాలపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో సుమారు 670 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఈ సంఖ్య కాస్త పెరిగే అవకాశం ఉంది. వీటిలో ఎక్కువ శాతం పాతబస్తీ పరిధిలోనే ఉన్నాయి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు మొహరించనున్నారు. 391 రూట్‌ మొబైల్స్, 129 గస్తీ వాహనాలు, 220 బ్లూకోల్ట్స్​తో పాటు అదనంగా 122 వాహనాలు ఏర్పాటు చేశారు. ఒక్కో రూట్‌ మొబైల్‌ వాహనంలో ముగ్గురు సాయుధ బలగాలు, ఒక కానిస్టేబుల్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

Assembly Election Arrangements in Greater Hyderabad : ఏదైనా సమస్య ఉంటే డయల్‌ 100కు ఫిర్యాదు చేస్తే నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడికి చేరుకునేలా అదనపు వాహనాలు సిద్ధంగా ఉంచనున్నారు. 45 ఫ్లైయింగ్ స్క్వాడ్, 45 స్టాటిక్ సర్వైయిలెన్స్ బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్నాయి. 7గురు డీసీపీలు, 28 మంది ఏసీపీల పర్యవేక్షణలో ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్ విధుల్లో ఉన్నారు. టాస్క్‌ఫోర్స్, స్పెషల్‌ఫోర్స్‌తో పాటు 71 మంది సీఐలు, 125 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లతో క్విక్ రియాక్షన్ టీమ్‌లు పనిచేస్తున్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓ మహిళా కానిస్టేబుల్‌కు విధులు కేటాయించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క ఓటరు ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఎన్నికలు వస్తున్నాయ్ బాస్ - పోస్టల్ ఓటు జాగ్రత్తగా వేయ్

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార జోరు - మేనిఫెస్టో వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.