ETV Bharat / state

రాష్ట్రంలో రసవత్తరంగా సాగుతోన్న ఎన్నికల ప్రచారాలు - రంగంలోకి దిగుతున్న స్టార్‌ క్యాంపెయినర్లు - కాంగ్రెస్​ స్టార్‌ క్యాంపెయినర్లు ఎవరు

Political Parties Election Campaign in Telangana : రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్లు ముగియడంతో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. నియోజకవర్గాల్లో అభ్యర్థులు తిరుగుతున్నారు. పార్టీల అధ్యక్షులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. వీరితో పాటు స్టార్‌ క్యాంపెయినర్లు (ప్రచార తారలు) రంగంలోకి దిగుతున్నారు.

BJP Star Campainers in Telangana
Congress Star Campainers in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 14, 2023, 9:03 AM IST

Political Parties Election Campaign in Telangana : రాష్ట్రంలో ఏదైనా నిర్ధిష్ట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కోసం పార్టీలు నామినేట్​ చేసే ప్రముఖ వ్యక్తులను స్టార్​ క్యాంపెయినర్లు అంటారు. సినిమా నటులు, ప్రముఖ రాజకీయ నాయకులు ఎవరైనా ప్రచారం చేసే అవకాశం ఉంది. ప్రధాని, మాజీ ప్రధానులు, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, పార్టీల అధ్యక్షులు, అగ్రనేతలు.. తదితర వ్యక్తులు స్టార్​ క్యాంపెయినర్లుగా ఉపయోగించుకునే వెసులుబాటు ఎన్నికల సంఘం కల్పించింది.

National Parties Maximum Star Campaigners : స్టార్​ క్యాంపెయినర్లుగా జాతీయ పార్టీలు 40, రాష్ట్ర పార్టీలు 20 మందిని వినియోగించుకోవచ్చు. ఎవరైతే ప్రచారం చేస్తారో వారి జాబితాను నోటిఫికేషన్​ తేదీ నుంచి వారం రోజులలోపు ఎన్నికల సంఘానికి చెప్పాలి. స్టార్​ క్యాంపెయినర్​గా ప్రచారం చేసే వ్యక్తి తన వాహనంపై ఎన్నికల సంఘం చేసే పర్మిట్​ను అతికించాలి. వారు ఆ పార్టీ తరుఫున ప్రచారం చేస్తే ఆ ఖర్చును పార్టీ ఖాతాలో వేస్తారు. ప్రయాణం ఖర్చును పరిగణలోకి తీసుకోదు.

'స్టార్​ క్యాంపెయినర్​ ఎవరో ఈసీ ఎలా నిర్ణయిస్తుంది?'

  • స్టార్ క్యాంపెయినర్ నిర్వహించే సభ, ర్యాలీ, పోస్టర్లుతో అభ్యర్థి ఫొటోలున్నా, సమావేశాల్లో అభ్యర్థి పేరును ప్రస్తావించినా వాటి ఖర్చును అభ్యర్థి ఖాతాలోనే వేస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు సభలో పాల్గొన్నప్పుడు, వారి ఫొటోలతో కూడిన పోస్టర్లు ఉంటే, అటువంటి ర్యాలీ/సమావేశానికి అయ్యే ఖర్చులను అభ్యర్థులందరి ఖాతాలో సమానంగా విభజించి వేస్తారు.
  • ఒకవేళ స్టార్​ క్యాంపెయినర్(Star Campainers in Telangana)​ ప్రధాని, మాజీ ప్రధాని అయితే కేంద్రం నియమించిన భద్రతా సిబ్బందికి అవసరమైన బుల్లెట్​ప్రూఫ్​ వాహనాలకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. వీరితో పాటు మరో రాజకీయ ప్రముఖుడు వస్తే భద్రాతా ఏర్పాట్ల కోసం అయ్యే వ్యయంలో సగం అభ్యర్థే భరించాల్సి ఉంటుంది.

Star Campaigners Expendature : ఎన్నికల సంఘం విధించిన నిబంధనలను స్టార్​ క్యాంపెయినర్లు ఉల్లంఘించినా, విద్యేషపూరిత ప్రకటనలు చేసినా.. వారు పాల్గొన్న సమావేశాలు, ర్యాలీలు మొత్తం ఖర్చును అభ్యర్థుల ఖాతాలోనే వేస్తారు. నిర్థిష్ట నియోజకవర్గంలో క్యాంపెయినర్లు ప్రచారానికి పరిమితమయ్యారా లేదా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోదు.

కాంగ్రెస్​ స్టార్​ క్యాంపెయినర్​గా అజారుద్దీన్

Congress Star Campaigners in Telangana : తెలంగాణ అసెంబ్లీ సందర్భంగా బీఆర్ఎస్​ పార్టీ నుంచి సీఎం కేసీఆర్​, కేటీఆర్, హరీశ్​రావు.. తదితరులు 20 మంది క్యాంపెయినర్​గా ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్​ పార్టీ నుంచి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌, రేవంత్​రెడ్డి తదితరలు 40 మంది పాల్గొనున్నారు. బీజేపీ నుంచి ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్​నాథ్​సింగ్​, నితిన్​గడ్కరీ, యోగి ఆదిత్యనాథ్, కిషన్​రెడ్డి.. తదితరలు 40 మంది ఈ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు.

MP Komati reddy: కోమటిరెడ్డికి కీలక బాధ్యతలు.. స్టార్‌ క్యాంపెయినర్‌గా నియామకం

పది మందితో భాజపా స్టార్​ క్యాంపెయినర్​ జాబితా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.