ETV Bharat / state

Political Heat in Telangana : ఏ,బీ- టీమ్‌ల పంచాయితీ.. ఇంతకీ ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో..?

author img

By

Published : Jun 28, 2023, 7:56 AM IST

Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వెేడెక్కుతోంది. రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. నేతల మధ్య మాటాల తూటాలు పేలి తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇక ఎన్నికల సమీపిస్తున్న వేళ పార్టీలన్నీ ఒకరినొకరు.. ఏ టీమ్.. బీ టీమ్ అంటూ విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ ఏ, బీ టీమ్​ల పంచాయితీ ఏంటో..? ఎవరు ఎవరితో కుమ్మక్కవుతున్నారో..?

kcr
kcr
ఏ,బీ-టీమ్‌ల పంచాయితీ.. ఇంతకి ఎవరుఎవరితో కుమ్మక్కయ్యారో

Political Heat in Telangana : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మహారాష్ట్రలోని సర్కోలిలో జరిగిన బీఆర్​ఎస్​ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌... రైతుల పక్షాల పోరాడే పార్టీ బీఆర్​ఎస్​ఏ అని నినదించారు. తాము ఎవ్వరికీ ఏ టీమ్‌, బీ టీకామ్‌ కాదని... రైతులంతా ఒక్కటై బీఆర్​ఎస్​ వెంట ఉంటున్నారనే.. కాంగ్రెస్‌, బీజేపీ ఆరోపణలు చేస్తున్నారని.. కేసీఆర్‌ తెలిపారు.

Telangana Assembly Elections 2023 : కేంద్రంలోని భారతీయ జనతాపార్టీకి అన్ని విషయాల్లో.. బీఆర్​ఎస్​ ప్రభుత్వం సహకరిస్తోందని.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మధుయాస్కీ ఆరోపిస్తున్నారు. మహారాష్ట్రలో బలంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీసేందుకు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అక్కడ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

'అసలు అసత్యంగా, అసభ్యంగా, అవినీతికరంగా, అసమర్థత పారిపాలన చేస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర్​ రావ్​ బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యారు. మొన్నటి వరకు మోదీకి రిప్రెజెంటేషన్​ ఇస్తే గోడకి ఇచ్చినట్టే అన్నారు. నాగ్​పూర్​ సభలకు వెళ్లి మోదీ నా మిత్రుడని చెప్పారు. నిన్న మీరు ఒక మీటింగ్​ చూస్తే బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ అంటారు బీజేపీతో రాజీ ఉండదని. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాగర్​కర్నూల్​ వచ్చి రాజీ ఉండదు అంటారు. వీళ్లీద్దరు రాజీతోని రాజకీయం కుట్రతో దిల్లీలో కలుస్తారు. వీరిద్దరు మాట్లాడే భాషను గమనిస్తే ఒకే తీరుగా మాట్లాడతారు. చంద్రశేఖర్​ రావు బీజేపీ పార్టీ.' - మధుయాస్కీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత

Telangana Politics Updates : రాష్ట్రంలో బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేయడం వల్లే.. కాంగ్రెస్‌కు ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వరుస పరాజయాలు ఎదురయ్యాయంటూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. అంతటి ఆగకుండా... బీఆర్​ఎస్​ అభ్యర్థులు ఓడిపోతారనుకున్న 30 సీట్లలో.. కాంగ్రెస్‌ అభ్యర్థులకు కేసీఆరే.. ఆర్థిక సాయం చేస్తున్నారంటూ.. బండి సంజయ్‌ తీవ్ర విమర్శలు చేయడం.. రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి.

'ఇప్పుడు మాకు బీఆర్​ఎస్​కు ఒప్పందం కుదిరితే ఉపఎన్నికల్లో బీఆర్​ఎస్​కు వ్యతిరేకంగా గెలిచే పార్టీ ఏది..? వారికి అభ్యర్థులు ఎందుకు కరువైతున్నారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు ఎందుకు గెలుస్తుంది. బీఆర్​ఎస్​కు కాంగ్రెస్​ వ్యతిరేకం అయితే 2 సీట్లే ఎందుకు గెలిచింది. కాంగ్రెస్​ అనుకుంటే సరిపోదు కదా ప్రజలు అనుకోవాలి బీఆర్​ఎస్ వ్యతిరేకంగా ఎవరు పోరాడుతున్నారు అని. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ కలిసి పోటీ చేస్తాయని చెప్పింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానా రెడ్డి.'-బండి సంజయ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

అటు మహారాష్ట్రలోనూ.. కేసీఆర్‌ పర్యటనలపై శివసేన సీనియర్‌ నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌..స్పందించారు. మహారాష్ట్రలో రాజకీయాలపై బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ ప్రభావం... ఏమాత్రం ఉండబోదని వ్యాఖ్యానించారు. బీఆర్​ఎస్​..బీజేపీ B-టీమ్ అని ఆరోపణలు గుప్పించారు. పదునెక్కిన నేతల విమర్శలతో.. ఏ పార్టీతో ఏ పార్టీ ములాఖత్‌ అయ్యిందో తెలియక.. రాష్ట్ర ప్రజలు, ఆయా పార్టీల కిందిస్థాయి నేతలు అయోమయానికి గురవుతున్నారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.