ETV Bharat / state

తస్మాత్ జాగ్రత్త... ఫోన్​ పాస్​వర్డ్ '1234' అని పెడుతున్నారా? - సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

నగరంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అప్రమత్తంగా లేకపోవటం, తేలికైన పాస్​వర్డ్​లు పెట్టుకోవడం సైబర్ నేరగాళ్లకు పని సులవైపోతుందని పోలీసులు చెబుతున్నారు. మన నిర్లక్ష్యమే నిండా ముంచుతుందని ఫోన్​లకు కఠిన పాస్‌వర్డ్స్‌ పెట్టుకోవడమే శ్రీరామరక్ష అంటున్నారు.

police-want-to-be-vigilant-on-cybercrime

author img

By

Published : Sep 1, 2021, 1:02 PM IST

హైదరాబాద్​లోని ఓ ఆటో డ్రైవర్‌ ఫోన్‌ చోరీకి గురయింది. ఫోన్‌ లాక్‌ సహా గూగుల్‌పే, ఫోన్‌ అన్నింటికీ ‘అతను 1234’ అనే పాస్‌వర్డ్‌ పెట్టుకున్నాడు. అదే అతని కొంప ముంచింది. ఓ సైబర్‌ దొంగ అతని బ్యాంక్‌ ఖాతాలోని రూ.1.35 లక్షలు చాల సులువుగా స్వాహా చేశాడు. కూకట్‌పల్లి ఠాణాలో బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. అసలే ఆన్‌లైన్‌ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొంగొత్త తరహాలో కేటుగాళ్లు నిండా ముంచేస్తున్నారు. ఇలాంటి తరుణంలో స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌తోనే సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని సైబరాబాద్‌, రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

తేలికైనవే ఎక్కువగా...

మనం ఇంటి నుంచి బయటికెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా తాళం వేస్తాం. ఒకటికి.. రెండుసార్లు సరిగ్గా వేశామో లేదో తనిఖీ చేసుకుని బయటకు వెళ్తాం. అలాంటిది.. సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్‌ బ్యాకింగ్‌, యూపీఐ (ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం తదితరాలు), ఫోన్‌ పాస్‌వర్డ్‌ల విషయంలో మాత్రం చాల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాం. సైబర్‌ నేరాలు జరిగే అవకాశముందని తెలిసినా అప్రమత్తం కావడం లేదని సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అంటున్నారు.

తేలికైన పాస్‌వర్డ్స్‌ను పెట్టుకుంటే .. సైబర్‌ కేటుగాళ్ల చేతికి తాళాలు మనమే ఇస్తున్నట్లుగా బావించాలన్నారు. స్పాష్‌ డేటా అనే సంస్థ ..పాస్‌వర్డ్స్‌పై ఓ అధ్యయనం చేయగా..ప్రతి వంద మందిలో 43 మందే కఠినమైన (స్ట్రాంగ్‌) పాస్‌వర్డ్‌లను పెట్టుకుంటున్నట్లుగా తెలిందన్నారు. విచిత్రమేంటంటే ఎక్కువ శాతం ప్రజలు.. వారి పేరు. 123456, 13456789, పాస్‌వర్డ్‌, ఏబీసీడీఈ, 1111111.. ఇలా 50 రకాల తేలికైన పాస్‌వర్డ్స్‌నే చాలామంది పెట్టుకుంటున్నట్లుగా ఆ సర్వే తేల్చింది.

15 అక్షరాలు.. అంతకంటే ఎక్కువ...

పాస్‌వర్డ్‌ కచ్చితంగా 15 అక్షరాలు, అంతకంటే ఎక్కువగా ఉండాలని, అప్పుడు దానిని కనిపెట్టడం సైబర్‌ కేటుగాళ్లకు కొంచెం కష్టతరంగా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. పెద్ద, చిన్న అక్షరాలు, అంకెలు, స్పెషల్‌ క్యారెక్టర్స్‌.. ఇలా అన్నింటిని కలిపి పెట్టుకోవాలని సూచిస్తున్నారు. పాస్‌వర్డ్‌ తేలికైనదా? కఠినమైనదా? అని తెలుసుకునే అవకాశముంది. మీరు పాస్‌వర్డ్‌ పెట్టుకునే ముందే కింద స్ట్రాంగ్‌, లైట్‌, మీడియం అని వస్తుంది.

తరచూ మార్చుకోవాల్సిందే

సైబర్‌ కేటుగాళ్ల బారిన పడకుండా మనల్ని కాపాడే ఒకే ఒక్క ఆయుధం ‘పాస్‌వర్డ్‌’. దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ 1234.. ఏబీసీడీ.. ఇలాంటివి పెట్టుకోవద్దని రాచకొండ సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ హరినాథ్‌ ప్రజలకు సూచించారు. తరచూ పాస్​వర్డ్​ మార్చుతూ ఉండాలి. వాటిని ఒక దగ్గర ప్రత్యేకంగా నోట్‌ చేసుకోవాలని.. ఎవరితోనూ ఆ సమాచారాన్ని పంచుకోవద్దని ఆయన అన్నారు.

అన్నింటికి ఒకటే వద్దు

గూగుల్‌, ఫేస్‌బుక్‌, జీమెయిల్‌, ఇన్‌స్టాగ్రాం, ఇంటర్నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌.. ఇలా అన్నింటికీ సంబంధించిన పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడం చాలా కష్టమని అన్నింటికీ ఒక్కటే పెట్టుకుంటున్నారు. ఒక్కటి తెలిస్తే అన్ని ఖాతాల గుట్టు సైబర్‌ కేటుగాళ్ల చేతికి చిక్కుతుందని ఎవరూ గుర్తించడం లేదు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ అప్రమత్తం కావాలని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ- గంగాధర్‌ తెలిపారు.

ఇదీ చదవండి:ధాన్యం సేకరణలో ఎఫ్‌సీఐ ఆంక్షలు.. రాష్ట్రానికి వేలకోట్ల నష్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.