ETV Bharat / state

కుషాయిగూడ చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. నలుగురు అరెస్ట్​ - కుషాయిగూడలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు

కుషాయిగూడలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు

author img

By

Published : Aug 8, 2020, 11:34 AM IST

Updated : Aug 8, 2020, 1:14 PM IST

11:30 August 08

కుషాయిగూడ చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. నలుగురు అరెస్ట్​

మేడ్చల్​ జిల్లా కుషాయిగూడలో జరిగిన చోరీ కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేశారు. ఇంట్లో పనిచేస్తున్న వాచ్​మెన్​ దంపతులతో పాటు వారికి సహకరించిన మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు.  

ఈనెల 3న స్థిరాస్తి వ్యాపారి ఇంట్లో లాకర్లు పగులగొట్టి వాచ్‌మెన్ దంపతులు రూ.2 కోట్ల విలువైన నగలు, నగదు చోరీ చేశారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బాధితుడి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు వెళ్లిన సమయంలో చోరీ జరిగింది. బంగారు నగలు, వజ్రాలు, నగదు చోరీకి గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుమారు రూ.2 కోట్ల విలువైన సొత్తు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.  

6 నెలల నుంచి వ్యాపారవేత్త ఇంట్లో వాచ్‌మెన్‌గా నేపాల్ వాసి భీమ్ పనిచేస్తున్నాడు. ఇంట్లోని ద్విచక్రవాహనాన్ని కిలోమీటరు దూరంలో వదిలివెళ్లాడు. కుషాయిగూడ చౌరస్తాలో ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాచ్‌మెన్‌, మరో మహిళ మూటతో వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.  

ఇదీ చదవండి: స్థిరాస్తి వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ.. వాచ్‌మెన్ దంపతులే నిందితులు!

Last Updated : Aug 8, 2020, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.