ETV Bharat / state

Police Seize 17 KG Gold in Miyapur : మియాపూర్​లో 17 కిలోల బంగారం, కవాడిగూడలో 2.09 కోట్ల నగదు స్వాధీనం - RS 17 Lakh Seize in Yellandu Town

Police Seize 17 KG Gold in Miyapur : తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలోకి వచ్చనప్పటి నుంచి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్​లోని మూడు కమిషనరేట్ పరిధుల్లోని చెక్‌ పోస్టులలో, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా భారీగా నగదు, లిక్కర్ పట్టుబడుతోంది. నిన్న ఒక్క రోజే భారీగా నగదు బంగారం పట్టుబడింది.

RS.2.09 CR Seized in Kavadiguda Hyderabad
Police Seize 17 KG Gold in Miyapur
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2023, 4:32 PM IST

Updated : Oct 16, 2023, 9:06 PM IST

17 KG Gold Seized in Miyapur : రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు(Telangana Assembly Elections 2023) జరగనున్న వేళ.. అధికారులు చేపడుతున్న వాహన తనిఖీల్లో భారీ స్థాయిలో బంగారం, నగదు పట్టుబడుతోంది. మియాపూర్ పరిధిలో తనిఖీలు నిర్వహించిన మదాపూర్ ఎస్‌ వోటి పోలీసులకు 17 కిలోల బంగారం, 15.6 కిలోల వెండి పట్టుబడింది. సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తుండగా స్వాధీనం చేసకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

telangana assembly elections 2023
17 KG Gold Seized in Miyapur

Police Conduct Extensive Checking in Telangana : రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు.. పట్టుబడుతున్న నగదు, మద్యం, బంగారం

RS.2.09 CR Seized in Kavadiguda Hyderabad : హైదరాబాద్ గాంధీనగర్ పీఎస్‌ పరిధిలోని కవాడిగూడలో.. ఉత్తర మండల టాస్క్​ఫోర్స్ పోలీసులు చేసిన తనిఖీల్లో రూ. 2.09 కోట్ల నగదు పట్టుబడింది. దీనికి సంబంధించి ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు. కారుతో పాటు ద్విచక్ర వాహనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Police Seize RS. 29.40 Lakhs in Vanasthalipuram : వనస్థలీపురంలో ఎల్బీనగర్ ఎస్‌వోటి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారులో తరలిస్తున్న 29.40లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి గాగిల్లాపూర్ చెక్​పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో భాగంగా కారులో తరలిస్తున్న రూ.4.95 లక్షలను పోలీసులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జగద్గిరిగుట్ట పోలీస్​స్టేషన్ పరిధిలోని దేవమ్మ బస్తీలో ఎన్నికల నేపథ్యంలో పోలీసుల వాహనాల తనిఖీల భాగంగా.. ఓ వ్యక్తి నుంచి 1.17 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ఇక్రిశాట్ సమీపంలో ఏర్పాటు చేసిన టోల్​గేట్​ వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల నుంచి 8.8 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. కేపీహెచ్​బీ పోలీస్​స్టేషన్ పరిధిలోని రమ్య గ్రౌండ్స్ 26 లక్షల రూపాయలను బాలానగర్ ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Police Seized RS.30 Lakhs in Medchal Malkajgiri : కుషాయిగూడ ఠాణాపరిధిలోనూ భారీగా నగదు పట్టుకున్నారు. తాళ్లూరి చౌరస్తా వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా సతీష్ అనే వ్యక్తి వాహనంలో 30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ జోన్ పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. అయ్యప్ప సొసైటీలో వాహనాలను తనిఖీ చేస్తుండగా 32 లక్షల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు.

telangana assembly elections 2023
Police Seized RS.30 Lakhs in Medchal Malkajgiri

గచ్చిబౌలి పోలీస్​స్టేషన్ పరిధి వాహనాలను తనిఖీ చేస్తుండగా కారులో తరలిస్తున్న 10 లక్షల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. పేట్​బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సుచిత్ర సర్కిల్​లో.. గత రాత్రి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కారులో తరలిస్తున్న 7.81లక్షల రూపాయలను మేడ్చల్ ఎస్‌ఓటి పోలిసులు సీజ్ చేశారు.

నెక్లెస్​రోడ్​లో తనిఖీల్లో భాగంగా ద్విచక్ర వాహనదారుడి వద్ద రెండు లక్షల రూపాయలను.. లేక్ స్టేషన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ పోలీస్​స్టేషన్ పరిధిలో డబిల్​పూర్​ చెక్​పోస్టు వద్ద కారులో తరలిస్తున్న 4.12 లక్షల నగదును సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సార్ నగర్ పోలీస్​స్టేషన్ పరిధిలోని బల్కంపేట వద్ద ద్విచక్ర వాహనపై రామ్​కిషోర్ అనే వ్యక్తి 9.8 లక్షలు తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకున్నారు.

RS.17 Lakh Seize in Yellandu Town : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పోలీసులు తనిఖీలు చేస్తున్న క్రమంలో.. పట్టణానికి చెందిన వ్యాపారి నుంచి రూ. 17 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డ్ వద్ద వాహనాలను తనిఖీలు చేస్తుండగా.. మూడు బైక్​లపై వెళుతున్న వారి వద్ద నుంచి 29.2 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరో వైపు తనిఖీల్లో లిక్కర్, గంజాయి కూడా పట్టుబడుతోంది. హయత్​నగర్ ఎక్సైజ్ పరిధిలో కారుతో తరలిస్తున్న.. 33 కిలో గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎల్బీనగర్ పరిధిలో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ఇద్దరిని.. ఎల్బీనగర్ ఎస్వోటి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక సప్లైయర్​తో పాటు వినియోగ దారుడిని అరెస్ట్ చేసిన పోలీసులు వీరి నుంచి 27 ఎండిఎంఏ ఎక్ట్సాసి పిల్స్, రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.

Police Implementation Election Code Strictly in Telangana : ఎక్కడికక్కడ తనిఖీలు, సోదాలు.. ఎలక్షన్​ కోడ్​తో పోలీసుల రెడ్ అలెర్ట్

Police Seize Huge Amount of Gold and Money : రాష్ట్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు.. ఇప్పటివరకు రూ. 37 కోట్లకు పైగా జప్తు

Last Updated : Oct 16, 2023, 9:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.