ETV Bharat / state

హైదరాబాద్​లో న్యూయర్​ వేడుకలకు రాచకొండ సీపీ హుకుం - యువత జరభద్రం ఇక - నూతన సంవత్సరం 2024

Police Restrictions on New Year Celebrations 2024 : హైదరాబాద్​ నగరంలో న్యూయర్​ వేడుకలపై పోలీసులు హుకుం జులించారు. నూతన ఏడాది వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలంతా బాధ్యతాయుతంగా సహకరించాలని రాచకొండ సీపీ సుధీర్​ బాబు కోరారు. ఈమేరకు యువతకు, వేడుకల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

New Year Celebrations 2024
Police Restrictions on New Year Celebrations 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2023, 9:44 PM IST

Police Restrictions on New Year Celebrations 2024 : నూతన సంవత్సవ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ బాధ్యతాయుతంగా సహకరించాలని రాచకొండ సీపీ సుధీర్​ బాబు కోరారు. పబ్​లు, బార్లు, రెస్టారెంట్​లు, ఫామ్​హౌస్​లు, వైన్​షాపులు, ఈవెంట్​ ఆర్గనైజేషన్​ నిర్వాహకులతో సీపీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రజలు, యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారని అందుకే శాంతి భద్రతల సమస్య రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.

న్యూయర్​ వేడుకల(New Year Celebrations 2024) సందర్భంగా ట్రాఫిక్​, ఎస్​ఓటీ, షీ టీమ్స్​, పెట్రోలింగ్​ వంటి పోలీసు బృందాలు ఎటువంటి సంఘటనలు, నేరాలు జరగకుండా విధుల్లో ఉంటారని రాచకొండ సీపీ సుధీర్​ బాబు తెలిపారు. అవుట్​ డోర్​ కార్యక్రమాలు జరిగే చోట డీజే బాక్సులకు అనుమతి లేదని సీపీ సుధీర్​బాబు చెప్పారు. బాణసంచా కాల్చడానికి వీల్లేదని, పరిమితికి మించి ఈవెంట్​లోకి ప్రేక్షకులను అనుమతించకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. మహిళలపై ఎటువంటి వేధింపులు జరగకుండా నిరోధించడానికి షీ టీమ్స్​ బృందాలు విధుల్లో ఉంటారని పేర్కొన్నారు.

కేరళ లాటరీలో కనకవర్షం.. రూ.16కోట్లు గెలుచుకున్న అజ్ఞాత వ్యక్తి

Rachakonda CP Sudheer Babu Restrictions on New Year Celebrations in Hyderabad : న్యూ ఇయర్​ వేడుకల్లో డ్రగ్స్​ వినియోగాన్ని అరికట్టడానికి ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేస్తామని చెప్పారు. అలాగే నిషేధిత డ్రగ్స్​ సరఫరా చేసే ముఠాల మీద ఉక్కుపాదం మోపుతున్నామని రాచకొండ సీపీ స్పష్టం చేశారు. నిర్దేశిత సమయంలోపు పబ్​లు, బార్లు, వైన్​షాపులు మూసి వేయాలని హెచ్చరించారు. మైనర్​లకు మద్యం అమ్మే దుకాణాలపై కఠిన చర్యలు తప్పవని సీపీ సుధీర్​ బాబు హెచ్చరించారు.

న్యూయర్​ వేడుకలకు హైదరాబాద్​ పోలీసుల ఆంక్షలు :

  • బహిరంగ ప్రదేశాలు, పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు రాత్రి 1 గంట వరకే ఉండాలి
  • న్యూఇయర్​ వేడుకలు నిర్వహించే నిర్వాహకులు పది రోజుల ముందు నుంచే అనుమతులు తీసుకోవాలి
  • ప్రతీ ఈవెంట్​లో సీసీ కెమెరాలు,సెక్యూరిటీ సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి
  • అశ్లీల నృత్యాలకు అనుమతి లేదు
  • న్యూయర్​ వేడుకల్లో లౌడ్​ స్పీకర్ల శబ్ధ తీవ్రత 45 డెసిబుల్స్​ కంటే ఎక్కువ ఉండకూడదు
  • వేడుకలకు ఎవరూ కెపాసిటీకి మించి పాసులు ఇవ్వవద్దు
  • వేడుకలు నిర్వహించే చోట పార్కింగ్​ ఇబ్బందులు లేకుండా చూడాలి
  • లిక్కర్​ వినియోగించే వేడుకల్లో మైనర్లకు అనుమతి లేదు
  • నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్​ వాడకూడదు
  • మద్యం సేవించి వాహనం నడుపరాదు
  • మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష, మూడు నెలలు పాటు డ్రైవింగ్​ లైసెన్స్​ రద్దు

క్రిస్మస్​ రోజు ఈ కేక్స్​ చేయండి - ఫ్యామిలీతో తియ్యని వేడుక చేసుకోండి!

హైదరాబాద్​లో న్యూయర్​ వేడుకలపై పోలీసుల ఆంక్షలు - రాత్రి 1 గంట వరకే పర్మిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.