కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తున్న నేపథ్యంలో టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వద్దకు చేరుకుంది. దిల్లీలోని ఈడీ కార్యాలయం నుంచి రాహుల్‌గాంధీ బయటకు వచ్చే వరకు నిరసన ప్రదర్శనలు చేపట్టాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు.
నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీ బషీర్‌బాగ్‌కి చేరుకుంది. అక్కడి ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు రోడ్డుపైనే బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. సీపీ కార్యాలయం నుంచి అసెంబ్లీ వైపు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఈ నిరసన ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.
ర్యాలీ దృష్ట్యా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్ కూడలి, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, చింతల్ బస్తీ, లక్డీకపూల్, బషీర్‌బాగ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ కూడలి, అంబేడ్కర్ విగ్రహం, ఎన్టీఆర్ మార్గ్, లిబర్టీ జంక్షన్, సచివాలయ మార్గాల్లో వాహనాలను దారి మళ్లించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి.. LIVE : దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల నిరసన ర్యాలీ
12వేల జంటలు ఒకేసారి వివాహ బంధంలోకి.. వధువులకు ప్రభుత్వం నజరానా!